సచిన్ కంటే అతన్ని అవుట్ చేయడం చాలా కష్టం! టీమిండియాలో మోస్ట్ డేంజరస్ బ్యాటర్... అబ్దుల్ రజాక్ కామెంట్..

Published : Mar 28, 2023, 02:22 PM IST

క్రికెట్ ప్రపంచంలో 34 వేలకు పైగా పరుగులు, 100 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్, వరల్డ్ క్లాస్ బౌలర్లకు నిద్ర లేకుండా చేశాడు. అయితే భారత బ్యాటింగ్ లైనప్‌లో సచిన్ టెండూల్కర్ మోస్ట్ డేంజర్ బ్యాటర్ కానే కాదంటున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్...

PREV
16
సచిన్ కంటే అతన్ని అవుట్ చేయడం చాలా కష్టం! టీమిండియాలో మోస్ట్ డేంజరస్ బ్యాటర్... అబ్దుల్ రజాక్ కామెంట్..

పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ బౌలింగ్‌లో వన్డేల్లో 6 సార్లు అవుట్ అయ్యాడు సచిన్ టెండూల్కర్. ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్ కూడా తన సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్‌లో అబ్దుల్ రజాక్ బౌలింగ్ ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డానని కామెంట్ చేయడం విశేషం...

26

‘నా దృష్టిలో మోస్ట్ డేంజరస్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్. సచిన్ టెండూల్కర్ కూడా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాతే వస్తాడు. పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ఈ ఇద్దరినీ అవుట్ చేయడానికి ప్రణాళికలు రచించేది. ముఖ్యంగా వీరేంద్ర సెహ్వాగ్‌ని ఎంత త్వరగా అవుట్ చేస్తే టీమిండియాపై అంత త్వరగా పైచేయి సాధించే అవకాశం దొరుకుతుందని అనుకునేవాళ్లం...

36

సచిన్, సెహ్వాగ్ వికెట్లు తీస్తే టీమిండియాని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. బౌలింగ్ విషయానికి వస్తే జహీర్ ఖాన్ బౌలింగ్‌ ఫేస్ చేయడానికి పాక్ బ్యాటర్లు ఇబ్బంది పడేవాళ్లు. అతని బౌలింగ్ కోసం స్పెషల్‌గా ప్రాక్టీస్ చేసేవాళ్లు. జహీర్ తర్వాత ఇర్ఫాన్ పఠాన్ కొంత కాలం పాక్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు...

46

హర్భజన్ సింగ్ బౌలింగ్ ఫేస్ చేయడానికి కూడా పాక్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడేవాళ్లు. మిడిల్ ఆర్డర్‌లో యువరాజ్ సింగ్‌ని అవుట్ చేసేందుకు బౌలింగ్, ఫీల్డింగ్ మార్పులు చేయాల్సి వచ్చేది. సచిన్, సెహ్వాగ్, యువరాజ్‌లను అవుట్ చేస్తే, ఈ రోజు పెద్ద ప్లేయర్లను అవుట్ చేశామని చెప్పుకునేవాళ్లం...
 

56

సచిన్, సెహ్వాగ్ తర్వాత యువీ కోసం సీరియస్ ప్లాన్స్‌ రచించేవాళ్లం. వారికి ఎలా బౌలింగ్ చేయాలి? ఏ ఏరియాల్లో టార్గెట్ చేయాలి, ఫీల్డ్ సెట్టింగ్స్ ఎలా ఉంటాలనేది మీటింగ్స్‌లో మాట్లాడుకునేవాళ్లం..  నాకు తెలిసినంత వరకూ, గుర్తున్నంత వరకూ ఈ వీళ్లే పాకిస్తాన్‌తో మ్యాచుల్లో టీమిండియా తరుపున టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చారు...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్...

66

టీమిండియా బ్యాటర్ సచిన్ టెండూల్కర్, పాక్‌పై 69 వన్డేలు ఆడి 2526 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ 31 వన్డేల్లో 1071 పరుగులు చేశాడు. టెస్టుల్లో పాకిస్తాన్‌పై 9 టెస్టుల్లో 91.14 సగటుతో 1276 పరుగులు చేశాడు వీరేంద్ర సెహ్వాగ్... సచిన్ టెండూల్కర్, పాక్‌పై 18 టెస్టులు ఆడి 1057 పరుగులు చేశాడు..

click me!

Recommended Stories