మాహీ రిటైర్ అయ్యాక చెన్నై టీమ్ ఉత్తదే! ధోనీ ప్లేస్‌ని ఎవ్వరూ... ఇయాన్ మోర్గాన్ కామెంట్స్...

First Published Apr 23, 2023, 8:00 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌తో మహేంద్ర సింగ్ ధోనీ పూర్తిగా క్రికెట్‌కి వీడ్కోలు పలకబోతున్నాడు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమైన ధోనీ, కేవలం ఐపీఎల్ మ్యాచులు మాత్రమే ఆడుతున్నాడు...

Image credit: PTI

ఐపీఎల్ 2020, 21 సీజన్లలో పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయిన మహేంద్ర సింగ్ ధోనీ, ఆఖరి సీజన్‌ కావడంతో మూడు నెలల ముందు నుంచే ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. భారీ స్కోర్లు చేయకపోయినా ఉన్నంతసేపు బౌండరీలు, సిక్సర్లతో అభిమానులను అలరిస్తున్నాడు...
 

Image credit: PTI

సన్‌రైజర్స్‌తో మ్యాచ్ అనంతరం ‘ఇది నా క్రికెట్ కెరీర్‌లో లాస్ట్ ఫేజ్’ అంటూ వ్యాఖ్యానించాడు ధోనీ.. 2019 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, కేకేఆర్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్... మహేంద్ర సింగ్ ధోనీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

Latest Videos


‘ధోనీ ప్రతీ గేమ్‌లో లీనం అయ్యే విధానం అసాధారణంగా ఉంటుంది. మ్యాచ్ తర్వాత కుర్రాళ్లతో అనుభవం పంచుకునే విధానం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా నేర్చుకున్న అనుభవాన్ని, కుర్రాళ్లకు పంచాలనే తపన.. ధోనీలో కనిపిస్తోంది...

మహీ లాంటి కెప్టెన్‌, టీమ్‌లో ఆడడం ఎవ్వరికైనా అదృష్టమే. ధోనీ రిటైర్ అయ్యాకే అతను లేని లోటు తెలుస్తుంది. ఆయన ప్లేస్‌ని రిప్లేస్ చేయడం ఎవ్వరి వల్లా కాదు. ఆయన ఓ అన్-రిప్లేసబుల్ ప్రొడక్ట్...
 

Image credit: PTI

ధోనీ, ఐపీఎల్ నుంచి తప్పుకున్నాక సీఎస్‌కే ఎలా ఆడుతుందో చూడాలి. ఎందుకంటే సీఎస్‌కే ప్రతీ మ్యాచ్‌లో మాహీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతీ ప్లేయర్ కూడా ధోనీ చెప్పినట్టే కదులుతాడు.. 

మాహీ ఫినిష్ చేసే మ్యాచులను కూడా సీఎస్‌కే మిస్ అవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉన్న కీ ప్లేయర్లపై ఆ ప్రభావం కచ్ఛితంగా పడుతుంది. చెపాక్ స్టేడియంలో ధోనీ ఆడకపోతే చెన్నై టీమ్‌కి ఇంత సపోర్ట్ దక్కుతుందా? అంటే చెప్పలేం కూడా...

PTI PhotoShailendra Bhojak)(PTI04_17_2023_000216B)

చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉన్న స్పిన్నర్లు, ఆల్‌రౌండర్లు అందరిపైన ధోనీ ప్రభావం ఉంటుంది. ఎలా బౌలింగ్ చేయాలి? ఎక్కడ బౌలింగ్ చేయాలనే ప్రతీ చిన్న విషయాన్ని మాహీ సూచిస్తాడు. ఇప్పుడు అవన్నీ మిస్ అవుతారు...’ అంటూ వ్యాఖ్యానించాడు ఇయాన్ మోర్గాన్...

ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో  ఐపీఎల్ 2021 సీజన్‌లో ఫైనల్ చేరింది కోల్‌కత్తా నైట్‌ రైడర్స్. అయితే సీఎస్‌కేతో జరిగిన ఫైనల్‌లో ఓడిన కోల్‌కత్తా.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది... ఆ తర్వాతి సీజన్‌లో మోర్గాన్‌ని వేలానికి వదిలేసింది కేకేఆర్. 2022 మెగా వేలంలో ఇయాన్ మోర్గాన్ అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరడం విశేషం.. 
 

click me!