సీఎస్‌కేని సపోర్ట్ చేస్తూ రాబిన్ ఊతప్ప ట్వీట్... ఎప్పుడైనా కేకేఆర్‌కి ఇలా సపోర్ట్ చేశావా అంటూ...

Published : May 23, 2023, 10:33 PM IST

ఐపీఎల్‌ 2020 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత 2021 సీజన్‌లో టైటిల్ గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్. ప్లేఆఫ్స్‌లో సురేష్ రైనా ప్లేస్‌లో తుది జట్టులోకి వచ్చి ఇరగదీశాడు రాబిన్ ఊతప్ప... ఓ రకంగా ఊతప్ప కారణంగానే సురేష్ రైనాని పక్కనబెట్టేసింది సీఎస్‌కే...

PREV
19
సీఎస్‌కేని సపోర్ట్ చేస్తూ రాబిన్ ఊతప్ప ట్వీట్... ఎప్పుడైనా కేకేఆర్‌కి ఇలా సపోర్ట్ చేశావా అంటూ...

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పూణే వారియర్స్ ఇండియా, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కి ఆడిన రాబిన్ ఊతప్ప... చెన్నై సూపర్ కింగ్స్ తరుపున రెండు సీజన్లు ఆడి రిటైర్ అయ్యాడు...

29

2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరింది. దీంతో తన మాజీ టీమ్‌కి సపోర్ట్ చేస్తూ సీఎస్‌కే జెర్సీలో స్టేడియంలో కనిపించాడు రాబిన్ ఊతప్ప. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు ఊతప్ప...

39
Robin Uthappa and Shivam Dube

‘లెట్స్ గో చెన్నై సూపర్ కింగ్స్’అంటూ కొడుకుతో కలిసి సీఎస్‌కే జెర్సీలో ఫోటోలు షేర్ చేసిన రాబిన్ ఊతప్ప, #Yellove హ్యాష్‌ట్యాగ్ షేర్ చేశాడు. దీనికి అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది..

49

‘బ్రో చెన్నై తరుపున ఒకటి రెండు సీజన్లు ఆడి తన ఆత్మను అమ్ముకున్నాడు. కేకేఆర్‌ని ఇలా సపోర్ట్ చేసినట్టు నేనెప్పుడూ చూడలేదు’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన రాబిన్ ఊతప్ప, ‘లాయల్టీ, రెస్పెక్ట్ రెండూ కూడా ఇచ్చి పుచ్చుకోవాలి మై ఫ్రెండ్’ అంటూ రిప్లై ఇచ్చాడు...

59

2014లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన రాబిన్ ఊతప్ప, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ రెండో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 6 సీజన్ల పాటు కేకేఆర్‌కి ఆడిన రాబిన్ ఊతప్ప, 2020 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి, అటు నుంచి సీఎస్‌కేలోకి వచ్చాడు...

69

రాబిన్ ఊతప్పపై కేకేఆర్, షారుక్ ఖాన్ ఫ్యాన్స్ దాడి చేస్తున్నారు. ఆరు సీజన్ల పాటు రాబిన్ ఊతప్పని టీమ్‌లో పెట్టుకున్న కోల్‌కత్తా నైట్‌ రైడర్స్, అతనికి ఇచ్చిన గౌరవాన్ని మరిచిపోయి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని తిడుతూ కామెంట్లు పెడుతున్నారు.. 

79

2019 సీజన్‌లో రాబిన్ ఊతప్ప పరుగులు చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఓ రకంగా రాబిన్ ఊతప్ప స్లో ఇన్నింగ్స్‌ల కారణంగానే గెలవాల్సిన మ్యాచుల్లోనూ ఓడిపోయింది కేకేఆర్. ఈ కారణంగానే ఊతప్పను టీమ్ నుంచి విడుదల చేసింది కోల్‌కత్తా...
 

89

కేకేఆర్ ఫ్యాన్స్ దాడి చేస్తుండడంతో ‘నాపై ఇంత హేట్ వస్తుందని ముందుగానే ఊహించా. నాకు ఇదేమీ కొత్త కాదు. మీ అందరికీ శాంతి కలగాలి. లవ్ యూ ఆల్’ అంటూ మరో ట్వీట్ చేశాడు రాబిన్ ఊతప్ప...

99
Robin Uthappa

దీనికి ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ‘హేట్‌ ని తీసేయ్ మేరే భాయ్.. కేవలం ప్రేమను చూడు’ అంటూ రిప్లై ఇచ్చాడు ఇర్ఫాన్ పఠాన్. ‘జీవితమే ప్రేమతో నిర్మించబడింది మేరే భాయ్. లవ్, కేవలం ప్రేమ మాత్రమే ఈ ద్వేషాన్ని తుడిచిపెట్టగలడు’ అంటూ రిప్లై ఇచ్చాడు రాబిన్ ఊతప్ప... 

click me!

Recommended Stories