ఎంత ఖర్చైనా పర్లేదు, కోహ్లీని ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడించండి! అప్పుడే మాట వింటాడు.. - కేవిన్ పీటర్సన్

Published : May 06, 2023, 10:25 PM IST

ఐపీఎల్‌లో 16 సీజన్లుగా ఒకే ఫ్రాంఛైజీకి ఆడుతున్న ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన విరాట్ కోహ్లీని, ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి విరాట్, ఆర్‌సీబీలో కీ ప్లేయర్ అయిపోయాడు...

PREV
18
ఎంత ఖర్చైనా పర్లేదు, కోహ్లీని ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడించండి! అప్పుడే మాట వింటాడు.. - కేవిన్ పీటర్సన్
PTI Photo/Ravi Choudhary) (PTI05_06_2023_000409B)

ఐపీఎల్ కెరీర్ ఆరంభంలో సొంత రాష్ట్రానికి చెందిన ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడాలని అనుకున్నాడు విరాట్ కోహ్లీ. ఢిల్లీ టీమ్ మేనేజ్‌మెంట్, విరాట్ కోహ్లీ కంటే లెఫ్టార్మ్ పేసర్ ప్రదీప్ సాంగ్వాన్‌ని తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపించడంతో అండర్19 వరల్డ్ కప్ 2008 విన్నింగ్ కెప్టెన్ ఆర్‌సీబీకి వచ్చాడు...

28

ఆరంభంలో కోహ్లీ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా అతనికి వరుస అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దీంతో ఆర్‌సీబీతో ప్రత్యేకమైన అనుబంధం పెంచుకున్న విరాట్ కోహ్లీ, అదే ఫ్రాంఛైజీ తరుపున రిటైర్ అవ్వాలని అనుకుంటున్నాడు...

38

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ ఫుటేజీని ఐపీఎల్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. దీనిపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్ స్పందించాడు...

48

‘విరాట్ తన చిన్ననాటి కోచ్‌కి నమస్కరిస్తూ అద్భుతమైన వీడియో చూశాక నాకో ఐడియా వచ్చింది. విరాట్‌ని తన సొంత గూటికి తీసుకురండి. వచ్చే సీజన్‌కి ముందు విరాట్ కోహ్లీని సొంత టీమ్‌లోకి తీసుకొచ్చేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఎంత ఖర్చుకైనా వెనుకాడకూడదు..
 

58

బెక్‌హం, రొనాల్డో, మెస్సీలాంటి వాళ్లు కూడా ఇలా తమ కెరీర్‌లో వేరే టీమ్స్‌కి మారారు. దీనికి మీరేమంటారు?’ అంటూ అభిమానులతో పోల్ నిర్వహించాడు కేవిన్ పీటర్సన్...

68

కేవిన్ పీటర్సన్ పెట్టిన పోల్‌కి 55 శాతానికి పైగా మంది ‘అవును.. విరాట్ ఢిల్లీకి ఆడాలని’ ఓట్లు వేయగా, 45 శాతం మంది ‘లేదు... కోహ్లీ, ఆర్‌సీబీలోనే ఉండాలి’ అనే ఆప్షన్ ఎంచుకున్నారు...

78
Virat Kohli

ఐపీఎల్‌లో 7 వేల పరుగులు, 55 సార్లు 50+ స్కోర్లు చేసిన విరాట్ కోహ్లీకి ప్రస్తుతం ఏడాదికి రూ.16 కోట్లు చెల్లిస్తోంది ఆర్‌సీబీ. 2022కి ముందు ఏటా రూ.17 కోట్లు చెల్లించిన ఆర్‌సీబీ, అతన్ని వదులుకోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేదు. 

88
PTI Photo/Atul Yadav) (PTI04_20_2023_000184B)

ఎందుకంటే 16 సీజన్లుగా టైటిల్ గెలవకపోయినా ఆర్‌సీబీకి బీభత్సమైన ఫాలోయింగ్, క్రేజ్ ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీయే.. కోహ్లీ లేకపోతే ఆర్‌సీబీ ఆటకు, అది ఎప్పుడూ మూలన పడేది.. 

Read more Photos on
click me!

Recommended Stories