15 ఏళ్ల వయసులో 1009 స్కోరు చేసిన ప్రణవ్ ధనవాడే ఏమయ్యాడు... నిజంగా క్రికెట్‌లో రాజకీయాల వల్లే...

Published : Apr 18, 2023, 08:52 PM IST

సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్, ఐపీఎల్‌లో ఆరంగ్రేటం చేశాడు. ముంబై ఇండియన్స్ తరుపున ఆడే అవకాశం దక్కించుకున్నాడు. దీంతో మరోసారి ప్రణవ్ ధనవాడే ప్రస్తావన వస్తోంది.. ఎవరీ ప్రణవ్ ధనవాడే.. నిజంగా అర్జున్ టెండూల్కర్, క్రికెట్ రాజకీయాల వల్లే అతను మాయమయ్యాడా? 

PREV
110
15 ఏళ్ల వయసులో 1009 స్కోరు చేసిన ప్రణవ్ ధనవాడే ఏమయ్యాడు... నిజంగా క్రికెట్‌లో రాజకీయాల వల్లే...

15 ఏళ్ల వయసులో 1009 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ప్రణవ్ ధనవాడే, అండర్ 16కి ఎంపిక కాలేదు. కానీ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ మాత్రం అండర్16 వరల్డ్‌కప్ ఆడాడు. ఎందుకంటే అతను సచిన్ టెండూల్కర్ కొడుకు కాబట్టి ఈ దేశంలో డబ్బుంటే ఏదైనా సాధించొచ్చు. కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన ఫోటో ఇది. ఇప్పుడు అర్జున్ టెండూల్కర్, ఐపీఎల్ ఎంట్రీ ఇవ్వడంతో మళ్లీ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

210

ఇండియాకి వాణిజ్య రాజధాని అయిన ముంబై నుంచి చాలామంది మేటి క్రికెటర్లు భారత జట్టులోకి దూసుకొచ్చారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, అజింకా రహానే, రోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్... ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే. అలాంటి లిస్టులోనే చేరతాడని ప్రణవ్ ధనవాడే పేరు ఏడేళ్ల కిందట బాగా వినిపించింది. కానీ ఆ తర్వాత అతను ఎక్కడా కనిపించలేదు... 

310

స్కూల్ క్రికెట్ మ్యాచ్‌లో 1009 పరుగులు చేసి యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు ప్రణవ్ ధనవాడే. అయితే ఆ తర్వాత అతని గురించి ఎక్కడా వార్త కానీ, ఎలాంటి సమాచారం కానీ రాలేదు. అసలు ప్రణవ్ ఏమయ్యాడు, ఎందుకు క్రికెట్‌లో కనిపించడం లేదు?
 

410

మహారాష్ట్రలోని కళ్యాణ్ ఏరియాలో ఓ ఆటో డ్రైవర్‌కి మే 13, 2000వ సంవత్సరంలో జన్మించిన ప్రణవ్ ధనవాడే, కెసీ గాంధీ హై స్కూల్ తరుపున తన 16 ఏళ్ల వయసులో 323 బంతుల్లో 1009 పరుగులు చేసి, ఒకే ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇందులో 59 సిక్సర్లు, 129 ఫోర్లు ఉన్నాయి...

510

308.56 స్ట్రైయిక్ రేటుతో 6 గంటల 36 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఫలితంగా కేసీ గాంధీ హై స్కూల్ జట్టు 1465/3 భారీ స్కోరు చేసింది. ఇది కూడా ఓ రికార్డే. ఆ ఇన్నింగ్స్ తర్వాత మాయమైన ప్రణవ్ ధనవాడే, ప్రస్తుతం ఇంగ్లాండ్ క్రికెట్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఛెషైర్ క్రికెట్ బోర్డులో నార్త్ విచ్ క్లబ్‌ తరుపున ఆడుతున్నాడు..

610
Image credit: PTI


‘అందరూ అనుకుంటున్నట్టు అర్జున్ టెండూల్కర్ కారణంగా నా క్రికెట్ కెరీర్‌ నాశనం కాలేదు. అతను నాకు చాలా మంచి స్నేహితుడు. నేను 1009 స్కోరు చేసిన తర్వాత సచిన్ టెండూల్కర్, స్వయంగా నన్ను ఆయన ఇంటికి ఆహ్వానించారు. 
 

710

సచిన్ నన్ను ఇంటికి పిలిచారని అర్జున్ చెప్పగానే ఆశ్చర్యపోయా. అదంతా ఓ కలలా అనిపించింది. సచిన్ టెండూల్కర్‌ నాకు తాను సంతకం చేసిన బ్యాటును బహుమతిగా ఇచ్చారు. వారితో కలిసి డిన్నర్ చేయడం ఎప్పటికీ మరిచిపోలేను.

810

నేను స్కూల్ క్రికెట్‌లో చేసిన వెయ్యి పరుగుల ఫీట్ తర్వాత నాపై అంచనాలు పెరిగిపోయాయి. నా మ్యాచులు చూసేందుకు జనాలు ఆసక్తిగా వచ్చేవాళ్లు. ఇది నాపై ఒత్తిడి పెంచింది... ఆ తర్వాత  ఎప్పుడు బ్యాటింగ్‌కి వెళ్లినా ఆ ఒత్తిడిని ఫీల్ అయ్యేవాడిని. అంతకంటే పెద్ద స్కోరు చేయాలనే తపన, ఆతృత పెరిగిపోయి, నా పర్ఫామెన్స్‌పై ప్రభావం చూపించింది.

910

జనాలు నన్ను చూస్తున్నారనే ఆలోచన నా ఫోకస్‌ను దెబ్బతీసేది. లూజ్ షాట్స్ ఆడి అవుట్ అయ్యేవాడిని. అయితే ఇప్పుడు నేను కుదురుకున్నా. ఒత్తిడిని అధిగమించడం నేర్చుకున్నా. త్వరలోనే నా కమ్‌బ్యాక్ చూస్తారు...’ అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు 23 ఏళ్ల ప్రణవ్ ధనవాడే.

1010

‘రోహిత్ శర్మ అంటే నాకెంతో ఇష్టం. అతను ఇన్నింగ్స్ నిర్మించే విధానం చూడముచ్చటగా ఉంటుంది. రోహిత్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.  ఇప్పటిదాకా అతన్ని కలవలేదు కానీ త్వరలోనే కలుస్తానని అనుకుంటున్నా. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌కి ఆడాలని భావిస్తున్నా. ముంబైలో పుట్టి పెరిగిన నేను, కచ్ఛితంగా ఈ స్టార్లతో నిండిన జట్టులో ఉండడాన్ని ఎంతగానో ఇష్టపడతా’... అంటూ చెప్పుకొచ్చాడు ప్రణవ్ ధనవాడే...

click me!

Recommended Stories