నువ్వు అన్‌ఫాలో కొడితే నేను ఊరుకుంటానా?... సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య పూర్తిగా తెగిన ఆ బంధం...

Published : Apr 18, 2023, 04:06 PM IST

విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ... టీమిండియా మాజీ కెప్టెన్లు. భారత  జట్టుకి దూకుడు నేర్పించి, విదేశాల్లో కూడా విజయాలు అందుకోగలమని నిరూపించిన మొదటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ అయితే, విదేశాల్లో అద్భుత టెస్టు విజయాలు అందుకుని, మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్టు కెప్టెన్‌గా మారిన ఘనత విరాట్‌ది...

PREV
18
నువ్వు అన్‌ఫాలో కొడితే నేను ఊరుకుంటానా?... సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య పూర్తిగా తెగిన ఆ బంధం...
kohli ganguly

ఇద్దరూ లెజెండరీ కెప్టెన్లకి ఇప్పుడు ఒకరంటే ఒకరికి అస్సలు పడడం లేదు. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఏప్రిల్ 15న ఆర్‌సీబీ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, గంగూలీ వైపు కళ్లు ఉరిమి చూడడం, అతనితో షేక్ హ్యాండ్ చేయడానికి ఇష్టపడకపోవడం వంటి దృశ్యాలు తెగ వైరల్ అయ్యాయి...

28
Virat Kohli vs Sourav Ganguly

ఈ మ్యాచ్ తర్వాత ఏప్రిల్ 16న విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడు. నువ్వు అన్‌ఫాలో చేస్తే, నిన్ను ఫాలో చేయడానికి నేనేమైనా బచ్చాగాడినా అనుకున్నాడో ఏమో ఏప్రిల్ 17న సౌరవ్ గంగూలీ కూడా విరాట్ కోహ్లీని ఫాలోయింగ్ లిస్టు నుంచి తీసేశాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య సోషల్ మీడియా బంధం పూర్తిగా తెగిపోయింది.. 
 

38

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ వరకూ విరాట్ కోహ్లీకి అంతా సజావుగానే సాగింది. కోచ్ రవిశాస్త్రి కూడా కోహ్లీ ఏం చెప్పినా ఊ కొట్టడంతో భారత జట్టులో విరాటపర్వం నడిచింది. అయితే హెడ్ కోచ్ బాధ్యతల నుంచి రవిశాస్త్రి తప్పుకోవడంతోనే సీన్ రివర్స్ అయ్యింది...

48
Kohli-Ganguly

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు విరాట్ కోహ్లీ. అనుకున్నట్టే రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్సీ దక్కింది. అయితే నాటకీయ పరిణామాల మధ్య విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది బీసీసీఐ...

58

వన్డే ఫార్మాట్‌లో 73.5 శాతం విజయాలు నమోదు చేసిన విరాట్ కోహ్లీని ఇలా చెప్పాపెట్టుకుండా కెప్టెన్సీ నుంచి తప్పించడంపై చాలా పెద్ద చర్చే జరిగింది. అయితే కోహ్లీ ఫామ్‌లో లేకపోవడంతో అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని సమర్థించారు చాలామంది..
 

68

ఇలా జరిగిన నెల రోజుల గ్యాప్‌లో కేప్‌టౌన్ టెస్టు ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, టెస్టు కెప్టెన్సీకి కూడా రిటైర్మెంట్ ఇచ్చేశాడు. 40 విజయాలు అందుకున్న విరాట్ కోహ్లీ, మరో టెస్టు గెలిస్తే, ఆల్‌టైం మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా టాప్ 3లోకి వెళ్లేవాడు. కానీ ఆ రికార్డును కూడా పట్టించుకోకుండా కెప్టెన్సీకి రాజీనామా ఇచ్చేశాడు..

78
kohli ganguly

సౌరవ్ గంగూలీకి విరాట్ కోహ్లీ అంటే నచ్చడని, అందుకే అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించామని మాజీ బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపెట్టేశాడు. ఈ రాద్ధాంతం అంతా ముగిసిపోయిందనుకుంటున్న సమయంలో గంగూలీ, విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో తారసపడడంతో మళ్లీ రచ్చ మొదలైంది.. 

88
Virat Kohli Sourav Ganguly

మే 6న ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఈ ఇద్దరి మధ్య ఇంకెలాంటి నాటకీయ దృశ్యాలు చూడాల్సి వస్తుందోనని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.. 

Read more Photos on
click me!

Recommended Stories