ఎమ్మెస్ ధోనీ... టీమిండియా చరిత్ర గురించి చెప్పాలంటే మాహీకి ముందు, మాహీ తర్వాత అని విడదీసి చెప్పాలంటారు ఆయన అభిమానులు. భారత క్రికెట్‌పై అంతలా ప్రభావం చూపించిన ధోనీ కారణంగా దినేశ్ కార్తీక్, వృద్ధిమాన్ సాహా, రాబిన్ ఊతప్ప, షెల్డన్ జాక్సన్, పార్థివ్ పటేల్ వంటి వికెట్ కీపింగ్ బ్యాటర్లు సరైన అవకాశాలు దక్కించుకోలేకపోయారు...
2004లో ఎంట్రీ ఇచ్చి, పాకిస్తాన్‌పై భారీ సెంచరీతో టీమ్‌లో స్థిరమైన చోటు దక్కించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ... 2007లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి మూడు ఐసీసీ టైటిల్స్ సాధించాడు...
210
భారత జట్టులో మహేంద్రుడు ఓ మహా వృక్షంలా పాతుకుపోవడంతో మిగిలిన వికెట్ కీపింగ్ బ్యాటర్లు దేశవాళీ క్రికెట్‌లో ఎంతగా రాణించినా, చెప్పుకోదగ్గ అవకాశాలను దక్కించుకోలేకపోయాడు...
310
మాహీ కారణంగా టీమిండియాకి ఎక్కువ కాలం సెకండ్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా మిగిలిపోయిన వృద్ధిమాన్ సాహా, తాజాగా ధోనీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...
410
‘నా కెరీర్ మాహీ వల్ల సరిగ్గా సాగలేదని చాలామంది అంటుంటారు. ఒకవేళ అది నిజం అయినా ధోనీ లాంటి ప్లేయర్ వల్ల చోటు కోల్పోవడం కూడా గర్వించదగ్గ విషయమే..
510
మాహీతో ఆడిన ప్రతీ మూమెంట్‌ని నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఓ క్లబ్ మ్యాచ్ సమయంలో నేను, ధోనీ కలిసి ఓపెనింగ్ చేశాం...
610
నేను 36 పరుగుల వద్ద ఉన్నా, మాహీ 9 పరుగులతో ఉన్నాడు. అప్పుడు తను నా దగ్గరికి వచ్చి ‘సింగిల్ తీసి, నాకు స్ట్రైయిక్ ఇవ్వు...’ అని చెప్పా. నేను అలాగే చేస్తూ పోయా...
710
అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపు నేను ఇంకా 41 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తూనే ఉన్నా... మాహీ సెంచరీ పూర్తి చేసేసుకున్నాడు...
810
మాహీ అలా చెప్పి, నన్ను మోసం చేశాడు (నవ్వుతూ...). అయితే ధోనీ గేమ్‌ని ఎలా కంట్రోల్ చేయగలడో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే’ అంటూ కామెంట్ చేశాడు వృద్ధిమాన్ సాహా...
910
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు భారత క్రికెట్ బోర్డుపై, సెలక్టర్ల తీరుపై అసహనం వ్యక్తం చేసిన వృద్ధిమాన్ సాహా... శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు...
1010
ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడుతున్న వృద్ధిమాన్ సాహా, చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓపెనింగ్ చేసి 18 బంతుల్లో 11 పరుగులు చేసి నిరాశపరిచాడు.