చెల్లీ.. నీ వల్లే నేను మళ్లీ ఆడుతున్నా! హర్షల్ పటేల్ ఎమోషనల్ పోస్ట్...

Published : Apr 18, 2022, 12:05 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో 32 వికెట్లు తీసి, ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డీజే బ్రావో రికార్డును సమం చేసిన హర్షల్ పటేల్, 2022 సీజన్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున బరిలో దిగుతున్న విషయం తెలిసిందే...

PREV
19
చెల్లీ.. నీ వల్లే నేను మళ్లీ ఆడుతున్నా! హర్షల్ పటేల్ ఎమోషనల్ పోస్ట్...

గత మూడు సీజన్లలోనూ బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు ఆడిన హర్షల్ పటేల్, 2022 మెగా వేలంలో ఏకంగా రూ.10.75 కోట్లు దక్కించుకున్నాడు. రిటైన్ చేసుకున్నా రూ.4-6 కోట్లతో పోయేదానికి, వేలానికి వదిలేసి తిరిగి భారీ మొత్తం చెల్లించి హర్షల్ పటేల్‌ను కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

29

అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో తన ధరకు న్యాయం చేస్తూ మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్‌తో దూసుకుపోతున్నాడు హర్షల్ పటేల్. ఇప్పటిదాకా 5 మ్యాచులు ఆడిన హర్షల్ పటేల్... 6 వికెట్లు తీశాడు..

39

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కి ముందు హర్షల్ పటేల్ సోదరి మరణించడంతో టీమ్‌ని వీడాడు హర్షల్ పటేల్. చెల్లెలి అంత్యక్రియాల్లో పాల్గొని, తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సమయానికి జట్టులో చేరాడు... 

49

సొంత చెల్లి చనిపోతే హర్షల్ పటేల్, ఒక్కరోజులోనే తిరిగి మ్యాచ్‌కి రావడం చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే హర్షల్ పటేల్, ఇంత త్వరగా తిరిగి జట్టుతో కలవడానికి ఎంతో కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన చెల్లెలు చెప్పిన మాటలే కారణమట...

59

‘మా జీవితాల్లో నువ్వు లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది. నీ జీవితంలో ఎన్ని కష్టాలు, కన్నీళ్లు ఎదురైనా అన్నింటికీ చిరునవ్వుతో ఎదుర్కొన్నావు. తుది శ్వాస విడిచి వరకూ ఆ నవ్వుని చెరగనివ్వలేదు...

69

నేను నీతో హాస్పటిల్‌లో ఉన్నప్పుడు, గేమ్‌పైన ఫోకస్ పెట్టమని, నీ గురించి ఆలోచించవద్దని చెప్పి నన్ను ఇండియాకి తిరిగి పంపించేశావు. ఆ మాటలే నేను మళ్లీ గేమ్ ఆడడానికి రావడానికి కారణం...

79

నీ మాటలను గౌరవిస్తూ, నిన్ను ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటానని చెప్పడానికి నేను చేయగలిగింది ఇదే. నేను చేసే ప్రతీ పని, నువ్వు గర్వపడేలా ఉండేలా చూసుకుంటాను...

89

నా జీవితంలో ప్రతీ మూమెంట్‌లో నిన్ను మిస్ అవుతున్నా. అవి మంచివైనా, చెడ్డవైనా! ఐ లవ్ యూ సో మచ్... రెస్ట్ ఇన్ పీస్ జదీ’ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు హర్షల్ పటేల్...

99

చాలా కాలంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అర్చిత పటేల్, ఏప్రిల్ 9న తుదిశ్వాస విడిచింది. 

click me!

Recommended Stories