22 ఏళ్ల వయసులో మూడు రికార్డు ఫీట్స్... ఐపీఎల్‌ గెలవడంపై శుబ్‌మన్ గిల్ రియాక్షన్ ఇదే...

Published : May 30, 2022, 12:36 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా టైటిల్ విన్నర్‌గా నిలిచింది గుజరాత్ టైటాన్స్. అండర్ డాగ్స్‌గా సీజన్‌ని ఆరంభించి, మిగిలిన 9 జట్లకు చుక్కలు చూపిస్తూ... మొట్టమొదటి సీజన్‌లోనే టైటిల్ ఎగరేసుకుపోయింది...

PREV
18
22 ఏళ్ల వయసులో మూడు రికార్డు ఫీట్స్... ఐపీఎల్‌ గెలవడంపై శుబ్‌మన్ గిల్ రియాక్షన్ ఇదే...
Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి ఓపెనర్‌గా వ్యవహరించిన యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, ఈసారి గత రెండు సీజన్ల కంటే మెరుగైన పర్ఫామెన్స్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు...
 

28

ఐపీఎల్ 2020 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా భారత టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు శుబ్‌మన్ గిల్. కేకేఆర్‌ తరుపున గత మూడు సీజన్లలో ఆడిన శుబ్‌మన్ గిల్, స్ట్రైయిక్ రేటు కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు..

38

అలాంటి శుబ్‌మన్ గిల్‌ని రూ.8 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం దండగ... అని ట్రోల్స్ వచ్చాయి. ఆ విమర్శలకు తన ఆటతోనే సమాధానం చెప్పాడు శుబ్‌మన్ గిల్.. గత మూడు సీజన్లలో కేకేఆర్‌కి ఆడిన చేయలేకపోయింది, ఈసారి టైటాన్స్‌కి చేసి చూపించాడు...

48

2022 సీజన్‌లో 16 మ్యాచుల్లో 34.5 సగటుతో 483 పరుగులు చేశాడు శుబ్‌మన్ గిల్. గతంలో 120 కంటే తక్కువ స్ట్రైయిక్ రేటుతో ఆడిన గిల్, ఈ సారి 132కి పైగా స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేశాడు.. ఐపీఎల్‌లో తన హైయెస్ట్ స్కోరును రెండు సార్లు ఈ సీజన్‌లోనే బ్రేక్ చేశాడు...

58
Shubman Gill

22 ఏళ్ల వయసులోనే అండర్ 19 వన్డే వరల్డ్ కప్, ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్, ఇప్పుడు ఐపీఎల్ టైటిల్ గెలిచి... మూడు ఫార్మాట్లలోనూ టైటిల్స్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు శుబ్‌మన్ గిల్...

68

‘ఈ విజయం నాకెంతో ప్రత్యేకంగా. అండర్ 19 వరల్డ్ కప్ తర్వాత ఐపీఎల్‌ లాంటి భారీ టోర్నీని గెలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఐపీఎల్‌లో ఇది నాకు నాలుగో సీజన్...

78

ఈ సీజన్‌లో ఎలాగైనా టైటిల్ గెలవాలని ఫిక్స్ అయ్యా. కోచ్‌లతో ఈ విషయం గురించి మాట్లాడుతూ వచ్చా. క్రీజులో ఆఖరి వరకూ ఉండాలని ఫిక్స్ అయ్యి, బ్యాటింగ్‌కి వచ్చా... సిక్సర్‌తో మ్యాచ్‌ని ముగించడం చాలా ప్రత్యేకం...’ అంటూ కామెంట్ చేశాడు శుబ్‌మన్ గిల్...

88
Shubman Gill

ఐపీఎల్ 2022 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా శుబ్‌మన్ గిల్, ఇంగ్లాండ్ టూర్‌లో జరిగే ఐదో టెస్టుకి ఎంపిక అయ్యాడు.  ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టుకి ఎంపిక చేసిన జట్టులో రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌, కెఎల్ రాహుల్‌లకు ఓపెనర్లుగా చోటు దక్కింది...

Read more Photos on
click me!

Recommended Stories