Katherine Brunt and Nat Sciver: ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు కేథరిన్ బ్రంట్, నాట్ సీవర్ లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత ఐదేండ్లుగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరు మహిళా క్రికెటర్లు ఆదివారం పెళ్లి చేసుకున్నారు.
ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ లో కీలక ఆటగాళ్లుగా ఉన్న కేథరిన్ బ్రంట్, నాట్ సీవర్ లు మే 29న పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెటర్, ఇంగ్లాండ్ లో భారత సంతతి క్రికెటర్ ఇషా గుహ తన ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించింది.
26
2017లో లార్డ్స్ లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్ కు ఆ ఏడాది ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించిన ఈ ఇద్దరూ.. గత ఐదేండ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు.
36
2018 నుంచి ఈ ఇద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు. 2019 లో ఈ జంట.. ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. 2020 లోనే కేథిరన్-సీవర్ లు పెళ్లి చేసుకుందామని భావించారు.
46
కానీ కరోనా కారణంగా వీరి పెళ్లి పలు దఫాలు వాయిదా పడింది. కాగా కరోనా వ్యాప్తి తగ్గడంతో పాటు ప్రపంచం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్న తరుణంలో ఈ ఇద్దరూ ఇక పెళ్లికి ముహుర్తం పెట్టుకున్నారు. మే 29న ఇంగ్లాండ్ లో ఈ ఇద్దరూ క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇంగ్లాండ్ క్రికెటర్లు హాజరయ్యారు.
56
కాగా.. క్రికెట్ ప్రపంచంలో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడం ఇదే ప్రథమం కాదు. గతంలో న్యూజిలాండ్ కు చెందిన అమీ సాటర్త్వేట్-లీ తహుహు లు వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరికీ ఓ పాప కూడా ఉంది.
66
అంతేగాక సౌతాఫ్రికా కు చెందిన లిజెల్లె లీ - టాంజా క్రోంజ్ కూడా 2020 సెప్టెంబర్ లో పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరూ కూడా తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఈ రెండు జంటల తర్వాత ఇప్పుడు తాజాగా ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు కూడా పెళ్లి చేసుకోవడం గమనార్హం.