మలింగ బౌలింగ్ ఆడలేక కాదు, ఆ ఒక్క కారణంగానే మెయిడిన్ ఇచ్చా... 11 ఏళ్ల తర్వాత వీరూ వివరణ...

Published : May 15, 2022, 04:50 PM IST

టీ20 క్రికెట్‌ వచ్చిన తర్వాత టెస్టు క్రికెట్‌కి ఆదరణ తగ్గిపోయింది. ఐపీఎల్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆడే వన్డే సిరీస్‌ల సంఖ్య కూడా భారీగా పడిపోయింది. అయితే టెస్టుల్లో కూడా టీ20ల్లో బ్యాటింగ్ చేసి, క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్లు మజా ఇచ్చేవాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...

PREV
19
మలింగ బౌలింగ్ ఆడలేక కాదు, ఆ ఒక్క కారణంగానే మెయిడిన్ ఇచ్చా... 11 ఏళ్ల తర్వాత వీరూ వివరణ...
Virender Sehwag

మొదటి ఓవర్ మొదటి బంతి నుంచి బౌండరీల వర్షం కురిపించే వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ తర్వాత వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు...

29

టెస్టుల్లో రెండు త్రిబుల్ సెంచరీలు చేసిన ఏకైక భారత బ్యాటర్‌గా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్, టెస్టుల్లో 82.23, వన్డేల్లో 104.34, టీ20ల్లో 145.39 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో వీరూ స్ట్రైయిక్ రేటు 155.44గా ఉంది...

39

వీరేంద్ర సెహ్వాగ్ స్ట్రైయిక్‌లో ఉంటే, టెస్టుల్లో అయినా బౌలర్‌కి మెయిడిన్ ఓవర్ దక్కడం కష్టమే. అలాంటిది వీరూ, ఐపీఎల్‌లో లసిత్ మలింగ బౌలింగ్‌లో ఓ మెయిడిన్ ఆడాడు...

49

2011 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున బరిలో దిగిన వీరేంద్ర సెహ్వాగ్, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లసిత్ మలింగ బౌలింగ్‌లో ఆరు బంతుల్లోనూ డిఫెన్స్ ఆడి, పరుగులేమీ సాధించలేకపోయాడు...

59

‘నాకు తెలిసి నా కెరీర్‌లో పదేళ్ల తర్వాత ఆడిన మెయిడిన్ అనుకుంటా అది... ఐపీఎల్‌లో మెయిడిన్ ఆడడంతో అందరూ షాక్ అయ్యారు... వీరూ ఇలా చేస్తాడా? ఐపీఎల్‌లో మెయిడిన్ ఆడతాడా? అంటూ అందరూ షాక్ అయ్యి, వేలల్లో మెసేజ్‌లు చేశారు...

69

టీ20 క్రికెట్‌లో, అదీ ఐపీఎల్‌లో మెయిడిన్స్ ఆడడం చాలా పెద్ద నేరం. అయితే ఆ మ్యాచ్‌లో లసిత్ మలింగ అప్పటికే రెండు వికెట్లు తీశాడు. మరో వికెట్ పడితే, మేం భారీ స్కోరు చేయలేం...

79
Virender Sehwag

అదీకాకుండా నేను స్ట్రైయిక్ రొటేట్ చేస్తే, మలింగ మరో వికెట్ తీస్తాడని అనిపించింది. అందుకే షాట్స్ ఆడకుండా చాలా నిగ్రహించుకున్నా.. ... ఆ మ్యాచ్ తర్వాత షాట్స్ ఆడి ఉంటే బాగుండేదని ఫీల్ అయ్యా...’ అంటూ చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్...

89

2011లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరించిన వీరేంద్ర సెహ్వాగ్ 16 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు...

99

ఆ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్, ఉన్ముక్త్ చంద్‌లను పవర్ ప్లేలో క్లీన్ బౌల్డ్ చేసిన లసిత్ మలింగ, ఆ తర్వాత వేణుగోపాల్ రావ్, మోర్నీ మోర్కెల్‌, అశోక్ దిండాలను అవుట్ చేసి కేవలం 13 పరుగులిచ్చి ఓ మెయిడిన్‌తో 5 వికెట్లు తీశాడు... లసిత్ మలింగకి ఐపీఎల్‌లో ఇవే అత్యుత్తమ గణాంకాలు...

click me!

Recommended Stories