జడేజాది పెద్ద గాయమేమీ కాదు, కావాలనే కూర్చోబెట్టారు... సంజయ్ మంజ్రేకర్ కామెంట్...

First Published May 15, 2022, 2:34 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో డేవిడ్ వార్నర్ కెరీర్‌ను అమాంతం మార్చేసినట్టే, 2022 సీజన్‌ రవీంద్ర జడేజా కెరీర్‌ను ప్రశ్నార్థకంలో పడేసింది. సీఎస్‌కే కెప్టెన్‌గా 2022 సీజన్‌ని మొదలెట్టిన రవీంద్ర జడేజా, మధ్యలోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడం, ఆ తర్వాత జట్టుకి దూరం కావడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్..

రవీంద్ర జడేజాకి, సంజయ్ మంజ్రేకర్‌కి ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో జడ్డూని ‘బిట్స్ అండ్ పీస్ ప్లేయర్’ అంటూ వ్యాఖ్యానించాడు సంజయ్ మంజ్రేకర్...
 

Sanjay Manjrekar

సగం సగం టాలెంట్ ఉన్న ప్లేయర్లు, ఆల్‌రౌండర్లు ఎలా అవుతారో అర్థం కాదని, తానే సెలక్టర్‌ని అయితే రవీంద్ర జడేజాని టీమ్‌కి సెలక్ట్ చేసేవాడిని కాదని సంచలన వ్యాఖ్యలు చేశాడు సంజయ్ మంజ్రేకర్...

Latest Videos


ఈ వ్యాఖ్యల కారణంగా ఎప్పుడు హాఫ్ సెంచరీ చేసినా తన బ్యాటును ఖడ్గంలా తిప్పుతూ సెలబ్రేట్ చేసుకుంటాడు  రవీంద్ర జడేజా. మంజ్రేకర్ కామెంటరీ బాక్సులో ఉంటాడేమోనని వెతుకుతూ అలా మొదటిసారి బ్యాటును తిప్పానని, స్వయంగా వెల్లడించాడు జడేజా...

తాజాగా రవీంద్ర జడేజా సీఎస్‌కే కెప్టెన్‌గా నియమితుడై, ఆ తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకుని, గాయంతో సీజన్ మొత్తానికి దూరం కావడంపై తనదైన స్టైల్‌లో స్పందించాడు సంజయ్ మంజ్రేకర్...

‘చెన్నై సూపర్ కింగ్స్ గత మూడు సీజన్లలో రెండు సార్లు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది. ఆ జట్టులో ఏదో జరుగుతోంది. ఏం జరుగుతుందో చెప్పలేం కానీ సీఎస్‌కే ఇంతకుముందులా లేదని మాత్రం తెలుస్తోంది...
 

రవీంద్ర జడేజా గాయం చూస్తుంటే అదేమీ సీజన్ మొత్తానికి దూరమయ్యేంత పెద్దది కాదని అర్థమవుతోంది. అయినా కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత కొన్ని మ్యాచులకే అతన్ని గాయం పేరుతో పక్కనబెట్టారు...

Ravindra Jadeja

జడ్డూ పర్ఫామెన్స్ బాగోలేకపోవడంతో అతన్ని పక్కనబెట్టామని చెప్పడం ఇష్టం లేక, గాయం వంకను వాడి ఉంటారు. ఇప్పుడు అంబటి రాయుడు రిటైర్మెంట్ గురించి ప్రకటించి, వెంటనే దాన్ని వెనక్కి తీసుకున్నాడు..

ఫస్టాఫ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రిథమ్‌ని అందుకోవడానికి చాలా సమయం తీసుకుంది. దీపక్ చాహార్ అందుబాటులో లేకపోవడంతో మరో సీమర్ కోసం వెతకాల్సి వచ్చింది. జడేజా మాత్రం ఏం చేయగలడు...

టీమ్‌లో ఎన్ని మార్పులు చేసినా సీఎస్‌కే కొత్త వాళ్లని సరిగ్గా వాడుకోలేదు. సీనియర్లు ఒకటి రెండు మ్యాచుల్లో గెలిపించగలరేమో టైటిల్ మాత్రం గెలవలేరు. ఇంతకుముందులా ఒకే టీమ్‌తో గెలవాలని అనుకుంటే అది అన్ని సార్లు వర్కవుట్ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు సంజయ్ మంజ్రేకర్...

click me!