రిషబ్ పంత్ కంటే దినేశ్ కార్తీక్‌ని ఆడిస్తేనే బెటర్... టీ20 వరల్డ్ కప్ 2022పై హర్భజన్ సింగ్ కామెంట్స్...

Published : Apr 25, 2022, 03:35 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున ఆడుతున్న దినేశ్ కార్తీక్, అదిరిపోయే పర్ఫామెన్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడుతున్న దినేశ్ కార్తీక్, మ్యాచ్ ఫినిషర్‌ రోల్‌ను చక్కగా పోషిస్తున్నాడు...

PREV
19
రిషబ్ పంత్ కంటే దినేశ్ కార్తీక్‌ని ఆడిస్తేనే బెటర్... టీ20 వరల్డ్ కప్ 2022పై హర్భజన్ సింగ్ కామెంట్స్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో 8 మ్యాచులు ఆడిన దినేశ్ కార్తీక్, 105 సగటుతో 200 స్ట్రైయిక్ రేటుతో 210 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది....

29

ఐపీఎల్‌లో అదరగొడుతున్న దినేశ్ కార్తీక్, టీమిండియా తరుపున టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడాలని కలలు కంటున్నాడు. భారత జట్టుకి పొట్టి వరల్డ్ కప్ అందివ్వడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు దినేశ్ కార్తీక్...
 

39

‘ఫామ్‌ని పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తే... దినేశ్ కార్తీక్ ఆడుతున్న విధానం అద్భుతంగా ఉంది. బ్యాటుతోనే కాకుండా వికెట్ కీపింగ్‌లోనూ కార్తీక్ చాలా మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నాడు...

49

దినేశ్ కార్తీక్ ఆరంగ్రేటం నుంచే నెం.1 వికెట్ కీపర్. ఇప్పుడు ఫినిషర్‌గా రోల్‌ని పర్ఫెక్ట్‌గా నిర్వహించగలనని నిరూపించుకుంటున్నాడు. గత ఏడాది కేకేఆర్‌లో దినేశ్ కార్తీక్ కొంచెం ఆఫ్ కలర్‌లో కనిపించాడు...

59

గత ఏడాది పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. కీలక సమయాల్లో అవుట్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు అతను అదే మ్యాచ్ ఫినిషర్ పొజిషన్‌ని పర్ఫెక్ట్‌గా పోషిస్తున్నాడు. అతను మ్యాచ్‌లు గెలిపిస్తున్నాడు...

69

ఇప్పుడు రిషబ్ పంత్ కంటే దినేశ్ కార్తీక్ ముందంజలో ఉన్నాడు. నా ఉద్దేశంలో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడేందుకు దినేశ్ కార్తీక్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఉంటాడు...

79

ఆస్ట్రేలియాలో పిచ్‌ కండీషన్స్ ఫాస్ట్ బౌలర్లకు చక్కగా అనుకూలిస్తాయి. కార్తీక్ 360 డిగ్రీ గేమ్, మ్యాచ్ మూమెంట్‌నే మార్చేయగలదు. అతన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు... 

89

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో దినేశ్ కార్తీక్‌కి చోటు ఉండాలి. భారత జట్టుకి అతను రాణించలేక చోటు కోల్పోలేదు. అతనికి తగినన్ని అవకాశాలు రాక పెద్దగా రాణించలేకపోయాడు... ’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...
 

99

అయితే 36 ఏళ్ల దినేశ్ కార్తీక్, భారత జట్టులో చోటు కోసం యంగ్ వికెట్ కీపర్లు రిషబ్ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లతో పోటీపడబోతున్నాడు..

Read more Photos on
click me!

Recommended Stories