ఉమ్రాన్ మాలిక్ ఉగ్రరూపం... ఆఖరి ఓవర్‌లో త్రీ వికెట్ మెయిడిన్! హ్యాట్రిక్ జస్ట్ మిస్...

Published : Apr 17, 2022, 05:56 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌లో నటరాజన్‌ కరోనా కారణంగా జట్టుకి దూరం కావడంతో సన్‌రైజర్స్ టీమ్‌లోకి వచ్చాడు ఉమ్రాన్ మాలిక్. ఐపీఎల్‌లో వేసిన తొలి ఓవర్‌లోనే 150+ వేగాన్ని అందుకుని, అందర్నీ ఆశ్చర్యపరిచిన ఉమ్రాన్ మాలిక్... 2022 సీజన్‌లో చెలరేగిపోతున్నాడు...

PREV
19
ఉమ్రాన్ మాలిక్ ఉగ్రరూపం... ఆఖరి ఓవర్‌లో త్రీ వికెట్ మెయిడిన్! హ్యాట్రిక్ జస్ట్ మిస్...

ఆరంభ మ్యాచుల్లో 150+ వేగంతో బంతులు విసురుతూ ప్రతీ మ్యాచ్‌లోనూ ‘ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది మ్యాచ్’ రూపంలో లక్ష రూపాయలు గెలుస్తూ వచ్చిన ఉమ్రాన్ మాలిక్, వికెట్లు తీయలేకపోగా భారీగా పరుగులు ఇచ్చేవాడు...

29

అయితే కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్... 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. శ్రేయాస్ అయ్యర్, షెల్డన్ జాక్సన్ వికెట్లు తీసి సన్‌రైజర్స్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. 

39

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఉగ్ర రూపమే చూపించాడు ఉమ్రాన్ మాలిక్. మొదటి 3 ఓవర్లలో 28 పరుగులిచ్చి జితేశ్ శర్మ వికెట్ తీశాడు ఈ యంగ్ కశ్మీర్ పేసర్... 

49

మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగల 20వ ఓవర్ వేసిన ఉమ్రాన్ మాలిక్, రెండో బంతికే ఓడియన్ స్మిత్‌కి అవుట్ చేశాడు. 15 బంతుల్లో ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసిన ఓడియన్ స్మిత్, ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

59

ఆ తర్వాతి బంతికి పరుగులేమీ రాలేదు. నాలుగో బంతికి రాహుల్ చాహార్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు ఉమ్రాన్ మాలిక్. ఆ వెంటనే వైభవ్ అరోరాని క్లీన్ బౌల్డ్ చేసి... నాలుగు బంతుల్లో 3 వికెట్లు పడగొట్టాడు...

69

ఆఖరి బంతికి అర్ష్‌దీప్ సింగ్ వికెట్ తీస్తే, ఉమ్రాన్ మాలిక్‌కి హ్యాట్రిక్ దక్కి ఉండేది. అయితే అర్ష్‌దీప్ సింగ్ రనౌట్ రూపంలో అవుట్ కావడంతో ఉమ్రాన్ మాలిక్ హ్యాట్రిక్ మిస్ చేసుకున్నాడు...

79
Umran Malik

20వ ఓవర్‌లో హ్యాట్రిక్ వేసిన నాలుగో బౌలర్‌ ఉమ్రాన్ మాలిక్. ఇంతకుముందు ఇర్ఫాన్ పఠాన్ 2008లో, లసిత్ మలింగ 2009లో, జయ్‌దేవ్ ఉనద్కడ్ 2017లో ఈ ఫీట్ సాధించారు...

89

వీరిలో లసిత్ మలింగ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్‌ను మెయిడిన్‌గా మలిచిన బౌలర్‌గా నిలిచిన ఉమ్రాన్ మాలిక్... పంజాబ్ కింగ్స్‌పై ఈ ఫీట్ సాధించిన మొదటి బౌలర్‌గా నిలిచాడు...

99

20వ ఓవర్‌లో మెయిడిన్ వేసిన ఉమ్రాన్ మాలిక్ 4 ఓవర్లలో  28 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 22 పరుగలిచ్చి 3 వికెట్లు తీశాడు... 

click me!

Recommended Stories