మీ వల్ల కాదు, కనీసం అర్జున్ టెండూల్కర్‌నైనా ఆడించండి... ముంబై ఇండియన్స్‌కి అజారుద్దీన్ సలహా...

Published : Apr 17, 2022, 04:54 PM IST

ఐపీఎల్ 2022 మెగా వేలంలో ప్లేయర్ల కొనుగోలు విషయంలో అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించిన ముంబై ఇండియన్స్, సీజన్‌లో దానికి భారీ మూల్యమే చెల్లించుకుంది. ఇప్పటికే మొదటి ఆరు మ్యాచుల్లో ఓడిన రోహిత్ సేన, దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది...

PREV
111
మీ వల్ల కాదు, కనీసం అర్జున్ టెండూల్కర్‌నైనా ఆడించండి... ముంబై ఇండియన్స్‌కి అజారుద్దీన్ సలహా...

జస్ప్రిత్ బుమ్రాకి తోడు మరో స్టార్ బౌలర్ లేకపోవడం, చీప్‌గా కొనుగోలు చేసిన తైమల్ మిల్స్, బాసిల్ తంపి, జయ్‌దేవ్ ఉనద్కడ్, ఫ్యాబియన్ ఆలెన్ ఆశించిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోవడంతో వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది ముంబై ఇండియన్స్...

211

ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డి కాక్, హార్ధిక్ పాండ్యా వంటి ప్లేయర్లను వేలానికి వదిలేసి, భారీ ఆశలతో కిరన్ పోలార్డ్‌ని రిటైన్ చేసుకుంటే... అతను మునుపటిలా అటు బాల్‌తో కానీ, ఇటు బ్యాటుతో కానీ మ్యాజిక్ చేయలేకపోతున్నాడు...

311

డేవాల్డ్ బ్రేవిస్, తిలక్ వర్మ వంట యంగ్ బ్యాటర్లు అదరగొడుతున్నా... సీనియర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మాత్రం మెప్పించలేక, ముంబై ఓటములకు కారణంగా నిలుస్తున్నారు...

411

‘ఇప్పటికే ఆరు మ్యాచుల్లో ఓడిపోయారు. ఆశలు పెట్టుకున్న బౌలర్లు రాణించడం లేదు. ఇకనైనా కొత్త బౌలర్లను ట్రై చేస్తే మంచిది. అర్జున్ టెండూల్కర్‌కి ఓ ఛాన్స్ ఇవ్వండి...

511

అతను నెట్స్‌లో బాగా చెమటోడుస్తున్నాడు. అదీకాక అతని పేరు చివరి టెండూల్కర్ పేరు ముంబై ఇండియన్స్‌కి తిరిగి అదృష్టాన్ని తీసుకురావచ్చేమో...

611

టిమ్ డేవిడ్‌ని భారీ ధర పెట్టి కొనుగోలు చేశారు కానీ అతన్ని ఆడించడం లేదు. అలాంటి ప్లేయర్‌ని ఆడించనప్పుడు కొనుగోలు చేయడం ఎందుకు? 

711
Rohit Sharma

టీమ్‌లో మ్యాచ్ విన్నర్లు ఉన్నప్పుడు, వారిని ఊరికే కూర్చోబెట్టడం దేనికి? ఇప్పటికైనా టీమ్‌లో మార్పులు చేస్తూ, అందరికీ అవకాశాలు ఇవ్వండి... 

811
Mumbai Indians

ఏం చేసినా విజయం రానప్పుడు కొత్త కొత్త ప్లేయర్లను ప్రయత్నించడంలో తప్పు లేదు కదా. ముంబైలో ఉన్న చాలామంది ప్లేయర్లను మిగిలిన ఫ్రాంఛైజీలు ఎప్పుడూ ఫేస్ చేయలేదు...
 

 

911

అలాంటి కొత్త ప్లేయర్లను తీసుకురావడం వల్ల విజయావకాశాలు కాస్త మెరుగవుతాయి. మెగా వేలంలో మంచి మంచి బ్యాటర్లను కొనుగోలు చేశారు. బౌలింగ్ యూనిట్‌ని మాత్రం పట్టించుకోలేదు.

1011

బుమ్రా ఒక్కడిపైనే ఆధారపడితే అతను మాత్రం ఏం చేస్తాడు? బుమ్రాలాంటి ప్లేయర్‌పై అధికంగా ఒత్తిడి పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అతను సాధారణ మనిషే కదా...

1111

బుమ్రాతో మొదటి ఓవర్ వేయించి ప్రయత్నించాలి. ఎందుకంటే 2, 3వ ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌కి వస్తే అప్పటికే బ్యాటర్లు పిచ్‌కి అలవాటు పడతారు కదా...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్..

Read more Photos on
click me!

Recommended Stories