ధోనీ, కోహ్లీ అలా అంటుంటే గర్వంగా ఉంది... ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ రషీద్ ఎమోషనల్...

First Published Apr 26, 2022, 4:23 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటిదాకా 7 మ్యాచులు ఆడితే, 7 మ్యాచుల్లోనూ ‘ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు ఉమ్రాన్ మాలిక్. 7 మ్యాచుల్లో 10 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు...

22 ఏళ్ల ఉమ్రాన్ మాలిక్, 150+ కి.మీ.ల వేగంతో బంతులు విసురుతూ ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్‌కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయాడు...

జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి చెందిన ఉమ్రాన్ మాలిక్ త్వరలోనే టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ఉమ్రాన్ మాలిక్‌కి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది...

Latest Videos


‘నా కొడుకుని టీమిండియా జెర్సీలో చూడాలనేది నాకున్న ఒకే ఒక్క కల. అతను వరల్డ్ కప్‌లో ఏదో రోజు ఆడాలని కోరుకుంటున్నా... అతను ఆడతాడనే నమ్మకం కూడా ఉంది...

అతను ఈ స్థాయికి చేరుకున్నాడంటే, టీమిండియాలోకి త్వరలోనే వస్తాడనే నమ్మకం కలుగుతోంది. అదే జరిగితే ఉమ్రాన్ మాలిక్... దేశం గర్వించేలా చేస్తాడు...

ఉమ్రాన్.. నాతో రోజూ ఫోన్‌లో మాట్లాడుతాడు. చాలా విషయాలు చెబుతాడు. ఎమ్మెస్ ధోనీ, క్రికెట్‌లో లెజెండ్. విరాట్ కోహ్లీ చాలా గొప్ప క్రికెటర్... ఉమ్రాన్ ఈ ఇద్దరినీ కలిశాడు...

ధోనీ, కోహ్లీ ఇద్దరూ కూడా ఉమ్రాన్ మాలిక్‌తో నువ్వు టీమిండియా ఫ్యూచర్ స్టార్‌వి అని చెప్పారట.  ఈ విషయాన్ని నాతో పంచుకుని చాలా సంతోషించాడు ఉమ్రాన్..

క్రికెట్ లెజెండ్స్ నుంచి ఇలాంటి పొడగ్తలు వినడం చాలా సంతోషంగా అనిపిస్తోంది..’ అంటూ కామెంట్ చేశాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ రషీద్...

‘ప్రస్తుతం క్రికెట్‌లో ఉన్న ఫాస్ట్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్‌లా ఎవ్వరూ నిలకడగా 150+ కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేయలేరు.. అందుకే మా వాడు చాలా డిఫరెంట్... ’ అంటూ కామెంట్ చేశాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్..

click me!