కృనాల్ పాండ్యా కిస్‌పై స్పందించిన కిరన్ పోలార్డ్... నేను ఎంత సీరియస్‌గా ఉంటానో తెలుసుగా...

Published : Apr 26, 2022, 03:51 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా ముంబై ఇండియన్స్‌కి ఏదీ కలిసి రాలేదు. ఫస్టాఫ్‌లో ఆడిన 8 మ్యాచుల్లో 8 పరాజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్, ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్కమించింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలతో పాటు కిరన్ పోలార్డ్ ఫెయిల్యూర్ కూడా ముంబైని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది...

PREV
16
కృనాల్ పాండ్యా కిస్‌పై స్పందించిన కిరన్ పోలార్డ్... నేను ఎంత సీరియస్‌గా ఉంటానో తెలుసుగా...

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ మొదటి బంతికే అవుటైన కిరన్ పోలార్డ్... నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో పోలార్డ్ నెత్తిన కృనాల్ పాండ్యా ముద్దు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది...

26

ఈ సీజన్‌లో 8 మ్యాచుల్లో కలిపి 16.43 సగటుతో 115 పరుగులు చేసిన కిరన్ పోలార్డ్, బౌలింగ్‌లోనూ 3 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అదీకాక పోలార్డ్ అవుటయ్యే సమయానికి ముంబై ఓటమి ఖరారైపోయింది...

36

ఆ కోపం, చిరాకు కిరన్ పోలార్డ్ ముఖంలో స్పష్టంగా కనిపించింది. చాలామంది మాజీ క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్ కృనాల్ పాండ్యా అతి చేశాడని, పోలార్డ్ రియాక్ట్ అయ్యి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని విమర్శించారు...

46

తనను అవుట్ చేసిన పోలార్డ్‌ను తిరిగి అవుట్ చేసి... 1-1 తేడాతో సమం చేశానని... ఇప్పుడు అతను దీని గురించి తక్కువ మాట్లాడతాడని కామెంట్ చేశాడు కృనాల్ పాండ్యా...

56

తాజాగా దీనిపై స్పందించాడు కిరన్ పోలార్డ్... ‘కృనాల్ పాండ్యా... వెల్‌కమ్ టు కలెక్షన్ ఆఫ్ వికెట్స్... నేను బౌలింగ్‌లో ఎంత సీరియస్‌గా ఉంటానో నీకు బాగా తెలుసు... చివరికి ఇది 1-1... మై బాయ్... ఆల్ గుడ్ ఫన్...’ అంటూ ట్వీట్ చేశాడు...

66

దీనిపై కృనాల్ పాండ్యా తమ్ముడు, ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ హర్ధిక్ పాండ్యా కూడా స్పందించాడు. ‘హాహాహా... మై బాయ్స్...’ అంటూ లవ్ సింబల్ జోడించి కామెంట్ చేశాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా..

click me!

Recommended Stories