బ్యాటుకి తగలనే లేదు, రోహిత్ శర్మను అవుట్‌గా ప్రకటించిన థర్డ్ అంపైర్... కళ్ల జోడు కొనివ్వాలా అంటూ...

Published : May 09, 2022, 10:32 PM ISTUpdated : May 09, 2022, 10:35 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో అంపైర్, థర్డ్ అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో నో బాల్ ఇవ్వకపోవడం, కేకేఆర్, రాజస్థాన్ మధ్య మ్యాచ్‌లో వైడ్ బాల్స్ ఇవ్వడంపై పెద్ద రాద్ధాంతమే జరిగింది. తాజాగా మరోసారి థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా రోహిత్ శర్మ బలయ్యాడు...

PREV
110
బ్యాటుకి తగలనే లేదు, రోహిత్ శర్మను అవుట్‌గా ప్రకటించిన థర్డ్ అంపైర్... కళ్ల జోడు కొనివ్వాలా అంటూ...

ఐపీఎల్ 2022 సీజన్‌లో 11 మ్యాచులు ఆడి 18.0 సగటుతో 198 పరుగులు మాత్రమే చేయగలిగాడు రోహిత్ శర్మ. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోయిన రోహిత్, అత్యధిక స్కోరు 43 పరుగులు మాత్రమే..

210
Rohit Sharma

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ అందుకోలేకపోయినా 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసి... తన రేంజ్ మెరుపులు మెరిపించి ఫామ్‌లోకి వచ్చినట్టే కనిపించాడు రోహిత్ శర్మ...

310

గత మ్యాచ్ పర్ఫామెన్స్ కారణంగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటు నుంచి భారీ ఇన్నింగ్స్ వస్తుందని ఆశపడ్డారు ‘హిట్ మ్యాన్’ ఫ్యాన్స్. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లాడు థర్డ్ అంపైర్...

410

166 పరుగుల లక్ష్యఛేదనలో తొలి ఓవర్‌లోనే ముంబై ఇండియన్స్‌కి షాక్ తగిలింది. టిమ్ సౌథీ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి షాట్ ఆడబోయిన రోహిత్ శర్మను తాకిన ఓ బంతి, నేరుగా వెళ్లి వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ చేతుల్లో వాళ్లింది...

510

అయితే ఫీల్డ్ అంపైర్ బ్యాటుకి తగల్లేదనే ఉద్దేశంతో నాటౌట్‌గా ప్రకటించాడు. కేకేఆర్ డీఆర్‌ఎస్ తీసుకోగా టీవీ రిప్లైలో రోహిత్ బ్యాటుకి తగలడానికి ముందే స్పైక్ కనిపించింది. చాలాసేపు దాన్ని గమనించిన థర్డ్ అంపైర్, బ్యాటుకి బాల్ తగలడం వల్లే స్పైక్ వచ్చిందనే నిర్ణయానికి వచ్చి అవుట్‌గా ప్రకటించాడు...

610

థర్డ్ అంపైర్ నిర్ణయంపై అటు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌తో పాటు కోచ్ మహేళ జయవర్థనే, రోహిత్ శర్మ భార్య రితికా శర్మ తదితరులు షాక్‌కి గురి కావడం విశేషం...

710

ఆఖరికి బౌలర్ టిమ్ సౌథీ కూడా రోహిత్ శర్మ నాటౌట్‌ అనుకుని అనుమానం వ్యక్తం చేయడం, థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించగానే రోహిత్ శర్మ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూడడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదమైంది.

810

అసలే రోహిత్ శర్మ ఈ సీజన్‌లో పెద్దగా పరుగులు చేయడం లేదని ఫీల్ అవుతున్న ఫ్యాన్స్‌కి థర్డ్ అంపైర్ కోపాన్ని మరింతగా పెంచేసింది..

910

బ్యాటుకి తగలకముందే స్పైక్ వచ్చినప్పుడు అవుట్‌గా ఎలా ప్రకటిస్తారు? థర్డ్ అంపైర్‌కి కళ్లద్దాలు కొనివ్వాలా? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తూ, ట్రోల్స్ చేస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...

1010

రోహిత్ శర్మ అవుటైన కొద్దిసేపటికే తిలక్ వర్మ 6 పరుగులు చేసి అవుట్ కావడంతో 5 ఓవర్లు ముగిసే సమయానికి 32 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై ఇండియన్స్, నేటి మ్యాచ్‌లో ఓడితే లీగ్‌ను ఆఖరి పొజిషన్‌లో ముగించాల్సి ఉంటుంది...

Read more Photos on
click me!

Recommended Stories