నాకు సల్మాన్ ఖాన్ తెలీదు, రషీద్ ఖాన్ తెలుసు... పంజాబ్ కింగ్స్ బౌలర్ షాకింగ్ రిప్లై..

Published : May 09, 2022, 08:39 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న భారతీయ నటుల్లో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఒకడు. అయితే సౌతాఫ్రికా స్పీడ్ బౌలర్ కగిసో రబాడా మాత్రం తనకు సల్మాన్ ఖాన్ ఎవరో తెలీదంటున్నాడు...

PREV
16
నాకు సల్మాన్ ఖాన్ తెలీదు, రషీద్ ఖాన్ తెలుసు... పంజాబ్ కింగ్స్ బౌలర్ షాకింగ్ రిప్లై..

ఐపీఎల్ 2022 సీజన్‌లో 11 మ్యాచులు ఆడి ఐదు విజయాలు అందుకున్న పంజాబ్ కింగ్స్, ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది...

26

గత అనుభవాల కారణంగా మయాంక్ అగర్వాల్, అర్ష్‌దీప్ సింగ్‌లను మాత్రమే అట్టిపెట్టుకుని మిగిలిన ప్లేయర్లందరినీ వేలానికి వదిలేసిన పంజాబ్ కింగ్స్, మెగావేలంలో శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, కగిసో రబాడా వంటి ప్లేయర్లను కొనుగోలు చేసింది...

36

ఐపీఎల్ 2020 సీజన్ పర్పుల్ క్యాప్ విన్నర్ కగిసో రబాడాను మెగా వేలంలో రూ.9.25 కోట్ల భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది పంజాబ్ కింగ్స్...

46

ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 మ్యాచుల్లో 18 వికెట్లు తీసి ఈ సారి కూడా పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు. తాజాగా పంజాబ్ ప్లేయర్లతో ఓ ఫన్నీ కార్యక్రమాన్ని నిర్వహించింది ఆ ఫ్రాంఛైజీ యాజమాన్యం...

56

కగిసో రబాడాని యాంకర్ ‘మీకు సల్మాన్ ఖాన్ తెలుసా?’ అంటూ ప్రశ్నించింది. దానికి సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ‘లేదు, నాకు రషీద్ ఖాన్ తెలుసు...’ అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో యాంకర్ నవ్వేసింది..

66

యాంకర్ చెప్పిన సల్మాన్ ఖాన్ హిందీ డైలాగులను ఎంతో కష్టపడుతూ అనుకరించాడు కగిసో రబాడా. అలాగే పంజాబ్ ఆల్‌రౌండర్ ఓడియన్ స్మిత్ కూడా బాలీవుడ్ ఫేమస్ డైలాగులను తన స్టైల్‌లో చెప్పి, ఫ్యాన్స్‌ని అలరించాడు...

click me!

Recommended Stories