ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, సురేష్ రైనా వంటి ప్లేయర్లకు దక్కిన గౌరవం, క్రేజ్... భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కి దక్కలేదనే చెప్పాలి. ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శన ఇస్తూ సాగుతున్న శిఖర్ ధావన్, సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు...
ఐపీఎల్‌లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్న శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...
27
విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో 6402 పరుగులు చేసి టాప్‌లో ఉండగా శిఖర్ ధావన్ 6 వేలకు పైగా పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ 5746 పరుగులతో, డేవిడ్ వార్నర్ 5668 పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు...
37
2017లో శిఖర్ ధావన్ 3300+ పరుగులతో ఉన్న సమయంలో రోహిత్ శర్మ దాదాపు 4 వేల పరుగులు (3986) పరగుులు చేయగా... నాలుగేళ్ల తర్వాత గబ్బర్ 6 వేల పరుగులు చేరగా... రోహిత్ అతనికి 300 పరుగుల దూరంలో నిలవడం విశేషం..
47
అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌పై 1000+ పరుగులు పూర్తి చేసుకున్నాడు శిఖర్ ధావన్. రోహిత్ శర్మ, కేకేఆర్‌పై 1018 పరుగులు చేయగా, డేవిడ్ వార్నర్, పంజాబ్ కింగ్స్‌పై 1005 పరుగులు చేసి టాప్‌లో ఉన్నారు...
57
అలాగే సీఎస్‌కేతో మ్యాచ్‌లో 11 పరుగుల వద్ద టీ20 క్రికెట్‌లో 9 వేల పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు శిఖర్ ధావన్... టీమిండియా తరుపున 68 టీ20 మ్యాచులు ఆడిన ధావన్, 1759 పరుగులు చేశాడు.
67
టీమిండియా తరుపున విరాట్ కోహ్లీ టీ20ల్లో 10392 పరుగులు చేసి టాప్‌లో ఉండగా రోహిత్ శర్మ 10048 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. శిఖర్ ధావన్ 9000+ పరుగులతో, సురేష్ రైనా 8654 పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.
77
ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్, శిఖర్ ధావన్ కెరీర్‌లో 200వ ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం...