క్రిస్ గేల్, రోహిత్, విరాట్, వాట్సన్... హర్భజన్ ఆల్‌టైం ఐపీఎల్ ఎలెవన్ ఇదే! వార్నర్‌కి దక్కని చోటు...

First Published Apr 25, 2022, 7:46 PM IST

ఐపీఎల్‌ ద్వారా బీభత్సమైన పాపులారిటీ, క్రేజ్ తెచ్చుకున్న ఫారిన్ ప్లేయర్లలో డేవిడ్ వార్నర్ ముందు వరుసలో ఉంటాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కీ ప్లేయర్‌గా ఉన్న వార్నర్ భాయ్, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున బరిలో దిగుతున్నాడు.. 

ఐపీఎల్ 5600+ పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌, అత్యధిక సార్లు 50+ స్కోర్లు నమోదు చేసిన బ్యాట్స్‌మెన్‌గా టాప్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో 53 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు చేశాడు వార్నర్.

అయితే భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రకటించిన ఆల్‌టైం ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్‌లో డేవిడ్ వార్నర్‌కి చోటు దక్కలేదు. 

Latest Videos


ఓపెనర్లుగా విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్‌ని ఎంపిక చేశాడు హర్భజన్ సింగ్. అతనితో పాటు భారత సారథి, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను మరో ఓపెనర్‌గా ఎంచుకున్నాడు. 

ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో 6 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్ ఆల్‌టైం ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్‌లో వన్‌డౌన్ ప్లేయర్‌గా చోటు దక్కింది...

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లకి ఆడిన ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కి హర్భజన్, ఐపీఎల్ ఆల్‌టైం బెస్ట్ టీమ్‌లో చోటు దక్కింది...

ఆర్‌సీబీలో కీలక సభ్యుడిగా, ఐపీఎల్‌లో బెస్ట్ ఫినిషర్‌గా రికార్డులు క్రియేట్ చేసిన ఏబీ డివిల్లియర్స్‌కి కూడా హర్భజన్ సింగ్, ఐపీఎల్ ఆల్‌టైం బెస్ట్ ఎలెవన్‌లో ఐదో స్థానం బ్యాటర్‌గా చోటు దక్కింది...

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా నాలుగు టైటిల్స్, 8 ఫైనల్స్, 11 ప్లేఆఫ్స్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని... తన ఆల్‌టైం ఐపీఎల్ టీమ్‌కి కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఎంచుకున్నాడు హర్భజన్ సింగ్.

చెన్నై సూపర్ కింగ్స్ 2021 సీజన్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి, ఈ సీజన్‌లో కెప్టెన్‌గా కొత్త అవతారం ఎత్తిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి కూడా భజ్జీ, ఐపీఎల్ ఆల్‌టైం ఎలెవన్‌‌లో స్థానం దొరికింది...

ముంబై ఇండియన్స్‌లో కీలక సభ్యుడిగా ఉంటూ, ఆల్‌రౌండర్‌గా అదరగొట్టిన విండీస్ దిగ్గజం కిరన్ పోలార్డ్‌కి కూడా భజ్జీ, ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు లభించింది...

స్పిన్నర్‌గా, ఓపెనర్‌గా, ఫినిషర్‌గా విభిన్నమైన పాత్రలు పోషించగల విండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌ కూడా హర్భజన్ సింగ్, ఆల్‌టైం ఐపీఎల్ టీమ్‌లో స్థానం దొరికింది..

ముంబై ఇండియన్స్‌ మాజీ పేసర్, ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్ లసిత్ మలింగను తన ఆల్‌టైం ఐపీఎల్ బెస్ట్ టీమ్‌కి ఫాస్ట్ బౌలర్‌గా ఎంచుకున్నాడు హర్భజన్ సింగ్.

అలాగే ముంబై ఇండియన్స్ విజయాల్లో కీ రోల్ పోషించిన భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాకి కూడా హర్భజన్ సింగ్ ఐపీఎల్ ఆల్‌టైం బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది...

హర్భజన్ సింగ్ IPL ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవన్: క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, షేన్ వాట్సన్, ఏబీ డివిల్లియర్స్, ఎమ్మెస్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, కిరన్ పోలార్డ్, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రిత్ బుమ్రా

click me!