అశ్విన్, ఉమేశ్, కుల్దీప్, దినేశ్, దీపక్... ఐపీఎల్ 2022 సీజన్‌లో అదరగొట్టిన సీనియర్లు వీరే...

First Published May 21, 2022, 5:30 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌కి ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ఓ ప్రత్యేకమైన స్థానం ఉండిపోతుంది. ప్రతీ సీజన్‌లో స్టార్ ప్లేయర్లు, యంగ్ క్రికెటర్లు అదరగొట్టడం ఆనవాయితీగా వస్తున్న ఐపీఎల్‌లో ఈసారి మాత్రం గత కొన్ని సీజన్లుగా పెద్దగా ఎవ్వరూ పట్టించుకోని సీనియర్లు... చెలరేగిపోయి మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌లు ఇచ్చారు... అలా ఏ మాత్రం అంచనాలు లేకుండా   ఐపీఎల్ 2022 సీజన్‌ని ఆరంభించి, అదరగొట్టిన సీనియర్లు వీరే...

ఉమేశ్ యాదవ్: ఐపీఎల్ 2022 సీజన్‌ని వైడ్ బాల్‌తో ప్రారంభించాడు కేకేఆర్ బౌలర్ ఉమేశ్ యాదవ్. మెగా వేలంలో తొలుత అమ్ముడుపోని ఉమేశ్ యాదవ్, ఈ సీజన్‌లో అంచనాలకు మించి రాణించాడు. 12 మ్యాచుల్లో 7.06 ఎకానమీతో 16 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్, మొదటి ఓవర్‌లోనే వికెట్లు తీసి అదరగొట్టాడు...

Ravichandran Ashwin

రవిచంద్రన్ అశ్విన్: సీనియర్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌పైన కూడా ఈ సీజన్‌లో ఎలాంటి అంచనాలు లేవు. అయితే రాజస్థాన్ రాయల్స్‌కి మ్యాచ్ విన్నర్‌గా మారాడు అశ్విన్. 7.14 ఎకానమీతో బౌలింగ్ చేసిన అశ్విన్, 14 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. బ్యాటుతోనూ రాణించి 183 పరుగులు చేశాడు అశ్విన్..

కుల్దీప్ యాదవ్: ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్లుగా కుల్దీప్ యాదవ్ పర్ఫామెన్స్ ఏ మాత్రం బాగోలేదు. కేకేఆర్‌లో ఎక్కువ మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితమైన కుల్దీప్ యాదవ్‌ని బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ సీజన్‌లో 13 మ్యాచుల్లో 20 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, ఢిల్లీ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు...

దినేశ్ కార్తీక్: కేకేఆర్‌కి కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా వ్యవహరించిన దినేశ్ కార్తీక్‌ని వేలంలో రూ.5.50 కోట్లకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ. పెద్దగా అంచనాలు లేకుండా సీజన్‌ని ఆరంభించిన దినేశ్ కార్తీక్, చాలా మ్యాచుల్లో ఆర్‌సీబీకి మ్యాచ్ విన్నర్‌గా మారాడు. 191.33 స్ట్రైయిక్ రేటుతో 287 పరుగులు చేసి, ఆర్‌సీబీకి మ్యాచ్ ఫినిషర్‌గా మారాడు...

దీపక్ హుడా: లక్నో సూపర్ జెయింట్స్‌కి కీలక ప్లేయర్‌గా మారిన దీపక్ హుడా, ఐపీఎల్ 2022 సీజన్‌లో 13 ఇన్నింగ్స్‌ల్లో 31.23 సగటుతో 406 పరుగులు చేశాడు. కెఎల్ రాహుల్ తర్వాత లక్నో తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు దీపక్ హుడా...

Wriddhiman Saha

వృద్ధిమాన్ సాహా: భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాపై కూడా ఈ సీజన్‌లో పెద్దగా అంచనాలు లేవు. అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో 9 మ్యాచుల్లో 39 సగటుతో 312 పరుగులు చేసిన సాహా, సీజన్‌లో 3 హాఫ్ సెంచరీలు సాధించి... టైటాన్స్‌కి కీ ఓపెనర్‌గా మారాడు..

click me!