ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లో మెరిసిన సారా టెండూల్కర్... స్పెషల్ అట్రాక్షన్‌గా సచిన్ ఫ్యామిలీ...

Published : Apr 16, 2022, 08:52 PM ISTUpdated : Apr 16, 2022, 10:33 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి ఏదీ కలిసి రావడం లేదు. టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్ శర్మ ఆడుతున్న మొట్టమొదటి సీజన్ ఇదే కావడంతో ముంబై ఇండియన్స్‌పై భారీ అంచనాలే ఉన్నాయి...

PREV
17
ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లో మెరిసిన సారా టెండూల్కర్... స్పెషల్ అట్రాక్షన్‌గా సచిన్ ఫ్యామిలీ...

ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ, 2022 సీజన్‌లో తొలి విజయం అందుకోవడానికి ఆపసోపాలు పడుతుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది...

27

తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది ముంబై ఇండియన్స్. సీజన్‌లో రోహిత్ సేనకి ఇది వరుసగా ఆరో పరాజయం..

37

అయితే లక్నో వర్సెస్ ముంబై మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ కూతురు సారా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ముంబై ఇండియన్స్ టీమ్‌కి సచిన్ టెండూల్కర్‌ మెంటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

47

సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్, ముంబై ఇండియన్స్‌ జట్టులో సభ్యుడిగా ఉండగా తల్లి అంజలితో కలిసి మ్యాచ్ చూడడానికి వచ్చిన సారా టెండూల్కర్... సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది...

57

మెంటర్ సచిన్ టెండూల్కర్, రిజర్వు బెంచ్‌ ప్లేయర్‌ అర్జున్ టెండూల్కర్‌తో పాటు సారా టెండూల్కర్ కూడా ముంబై ఇండియన్స్ జెర్సీలో ప్రత్యేక్షం కావడం విశేషం... 

67

సారా టెండూల్కర్, యంగ్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. 

77

దీంతో సారా టెండూల్కర్ స్టేడియంలో ప్రత్యేక్షం కావడంతో మరోసారి ఈ ఇద్దరి గురించి పోస్టులు, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories