ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి క్రేజ్, ఫాలోయింగ్ విషయంలో కొదువేం లేదు. అయితే ప్రతీ సారి టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగడం, వరుస మ్యాచుల్లో ఓడి ఫ్యాన్స్‌ని నిరాశపరచడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి ఫైవ్ టైం ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఆటతీరు, వింటేజ్ ఆర్‌సీబీని తలపించడం విశేషం...
ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడింది ఫైవ్ టైం టైటిల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్... టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగి, ప్లేఆఫ్స్ రేసు తప్పుకున్న మొట్టమొదటి జట్టుగా నిలవనుంది...
29
Mumbai Indians
ఐపీఎల్ చరిత్రలో మొదటి ఆరు మ్యాచుల్లో ఓడిన మూడో జట్టుగా నిలిచింది ముంబై ఇండియన్స్. ఇంతకుముందు 2013లో ఢిల్లీ క్యాపిటల్స్, 2019లో ఆర్‌సీబీ... మొదటి ఆరు మ్యాచుల్లో ఓడాయి...
39
ఐపీఎల్‌లో మొదటి ఆరు మ్యాచుల్లో ఓడిన రెండో భారత కెప్టెన్‌గా నిలిచాడు రోహిత్ శర్మ.. ఇంతకుముందు విరాట్ కోహ్లీ 2019లో ఇలాంటి చెత్త ఫీట్ నమోదు చేశాడు...
49
013లో మహేళ జయవర్థనే కెప్టెన్సీలో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడింది ఢిల్లీ క్యాపిటల్స్. ముంబై ఇండియన్స్ 2014లో, 2015లో వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడి, ఆరో మ్యాచ్‌లో విజయం సాధించగా... మొట్టమొదటి ఓటముల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టింది...
59
వరుస పరాజయాలతో ముంబై ఇండియన్స్ ప్లేయర్లతో ఫ్రస్టేషన్స్ పీక్స్‌లోకి వెళ్లింది. ఐపీఎల్ మెగా వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన ఇషాన్ కిషన్, అవుటై పెవిలియన్ చేరే సమయంలో బౌండరీ లైన్ దగ్గర ఉన్న అడ్వటైజింగ్ బోర్డును బ్యాటుతో బాదడం స్పష్టంగా కనిపించింది...
69
ఆర్‌సీబీ వరుస ఓటములు ఎదుర్కొన్న సమయంలో విరాట్ కోహ్లీ అండ్ టీమ్‌లో ఎలాంటి భావోద్వేగాలు కనిపించేవో... ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీమ్‌లోనూ అవే ఎమోషన్స్ కనిపిస్తున్నాయి...
79
ఐపీఎల్ 2019లో ఆర్‌సీబీ వరుస ఫెయిల్యూర్స్ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో పాల్గొంది భారత జట్టు. టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరినా, న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది...
89
ఐపీఎల్ 2021 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుస ఫెయిల్యూర్స్ తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడనుంది టీమిండియా... దీంతో భారత ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.
99
ఐదు సార్లు టైటిల్ గెలిచాడని రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇచ్చి, టీమిండియాకి వరల్డ్ కప్ అందిస్తాడని ఆశలు పెట్టుకుంటే... విరాట్‌లా చేసేలా ఉన్నాడని భయపడుతున్నారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్...