ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, డెక్కన్ ఛార్జర్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ వంటి జట్లకి ఆడాడు భారత మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ పార్థివ్ పటేల్...
2020 సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన పార్థివ్ పటేల్, సమయం దొరికినప్పుడల్లా ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ట్రోల్ చేయడానికి, సీఎస్‌కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పొడగడానికి సిద్దంగా ఉంటాడు...
28
భారత జట్టులో కీలక స్పిన్నర్‌గా, ఆల్‌రౌండర్‌గా మారిన రవిచంద్రన్ అశ్విన్‌కి, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కకపోవడం టీమిండియా విజయంపై చాలా పెద్ద ప్రభావమే చూపించింది...
38
చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 8 సీజన్లు ఆడిన రవిచంద్రన్ అశ్విన్, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకి ఆడాడు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో ఉన్నాడు...
48
R Ashwin
చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 90 మ్యాచుల్లో 97 వికెట్లు తీసిన రవి అశ్విన్, కేవలం 6.46 ఎకానమీతో పొదుపుగా పరుగులు ఇచ్చాడు. పంజాబ్ తరుపున 28 మ్యాచుల్లో 25 వికెట్లు తీసిన అశ్విన్, ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున 28 మ్యాచుల్లో 20 వికెట్లు మాత్రమే తీయగలిగాడు...
58
రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఆడిన 14 మ్యాచుల్లో 10 వికెట్లు తీశాడు అశ్విన్, ఒక్క సీఎస్‌కే మినహా మిగిలిన జట్లకి ఆడిన సమయాల్లో 7.25+ పైగా ఎకానమీతో పరుగులు సమర్పించాడు...
68
‘రవిచంద్రన్ అశ్విన్ సక్సెస్‌కి స్పిన్ పాత్ర చాలా ఉంటుంది. చెన్నైలో 140 లేదా 150 పరుగులు చేస్తే చాలు, దాన్ని కాపాడుకుంటూ విజయం అందుకోవచ్చు. అక్కడి పిచ్ స్పిన్‌కి బాగా అనుకూలిస్తుంది...
78
అలాగే స్పిన్నర్లను వాడడం కెప్టెన్లకు బాగా తెలియాలి. ఎమ్మెస్ ధోనీకి రవిచంద్రన్ అశ్విన్‌కి ఎక్కడ, ఎప్పుడు, ఎలా వాడాలో బాగా తెలుసు. 2010లో ఎమ్మెస్ ధోనీయే కొత్త బంతితో అశ్విన్‌ని బౌలింగ్ వేయించాడు...
88
పవర్ ప్లేలో స్పిన్నర్లకు బౌలింగ్ ఇవ్వడమంటే సాహసమనే చెప్పాలి. అయినా పిచ్‌ను బట్టి ఏ బౌలర్‌ని వాడాలనే అవగాహన ఎమ్మెస్ ధోనీకి ఉంది. అందుకే అశ్విన్ అక్కడ బాగా రాణించగలిగాడు...’ అంటూ కామెంట్ చేశాడు పార్థివ్ పటేల్...