ఐపీఎల్ 2022 సీజన్ రోహిత్ శర్మకి ఊహించని అనుభవాన్ని మిగిల్చింది. 8 సీజన్లలో ఐదు సార్లు టైటిల్ గెలిచి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచిన రోహిత్ శర్మ, ఈ ఏడాది ఆఖరి స్థానంలో నిలవాల్సి వచ్చింది...
లీగ్ స్టేజ్‌లో 14 మ్యాచుల్లో 10 పరాజయాలు మూటకట్టుకున్న ముంబై ఇండియన్స్, ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా పాయింట్ల పట్టికలో 10వ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది...
28
మెగా వేలంలో స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో కొత్త ప్లేయర్లు, పెద్దగా సక్సెస్ కాని ప్లేయర్లతో ఈ సీజన్‌ని నడిపించాల్సి వచ్చింది...
38
తిలక్ వర్మ, కుమార్ కార్తీకేయ, హృతిక్ షోకీన్ వంటి కుర్రాళ్లు ముంబై ఇండియన్స్ ద్వారా ఈ సీజన్‌లో ఆరంగ్రేటం చేసి అదరగొట్టారు. అయితే ఇషాక్ కిషన్, కిరన్ పోలార్డ్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు...
48
14 మ్యాచుల్లో కలిపి 268 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ, ఐపీఎల్ చరిత్రలో మొదటిసారిగా ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకుండానే సీజన్‌ని ముగించాడు. ఇంత దారుణమైన ఐపీఎల్ తర్వాత వెంటనే మాల్దీవులకు చెక్కేశాడు రోహిత్ శర్మ...
58
ఐపీఎల్ ముగిసిన తర్వాత హాలీడేస్‌కి మాల్దీవులకు వెళ్లడం రోహిత్ శర్మకు అలవాటు. 2020 సీజన్‌లో ఐదోసారి టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా టూర్ నుంచి రాగానే కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో వాలిపోయాడు రోహిత్ శర్మ.
68
2021 సీజన్‌లో కరోనా కేసులు, ఇంగ్లాండ్ టూర్ కారణంగా మాల్దీవులకు వెళ్లలేకపోయిన రోహిత్ శర్మ, ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ లీగ్ స్టేజీకి పరిమితం కావడంతో త్వరగానే అక్కడికి చేరిపోయాడు...
78
సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి కావాలని బీసీసీఐని కోరిన రోహిత్ శర్మ, జూలై 1న ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టుతో తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో మనోడికి నెల రోజుల విశ్రాంతి దొరికినట్టైంది...
88
ఈ సమయాన్ని కుటుంబంతో కలిసి ఏకాంతంగా గడిపేందుకు ఉపయోగించుకున్న రోహిత్ శర్మ, మాల్దీవుల్లో భార్య రితికా, కూతురు సమైరాలతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు...