మీరే కాదు, విరాట్ కోహ్లీ సెంచరీ కోసం నేను కూడా వెయిటింగ్... రషీద్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్..

Published : May 30, 2022, 03:01 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో సాధారణ ప్లేయర్‌గా బరిలో దిగాడు ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. రెండు సీజన్ల తర్వాత ఎలిమినేటర్‌ గండాన్ని దాటి రెండో క్వాలిఫైయర్‌కి వచ్చిన ఆర్‌సీబీ, టైటిల్ ఆశలను మాత్రం నెరవేర్చుకోలేకపోయింది...

PREV
18
మీరే కాదు, విరాట్ కోహ్లీ సెంచరీ కోసం నేను కూడా వెయిటింగ్... రషీద్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్..

ఐపీఎల్ 2022 సీజన్‌లో న్యూ ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, సీజన్ మొత్తం పూర్తి డామినేషన్ చూపించి ఫైనల్‌లోనూ రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయాన్ని నమోదు చేసింది...

28

ఐపీఎల్ 2022 సీజన్‌లో రూ.15 కోట్లకు డ్రాఫ్ట్ రూపంలో గుజరాత్ టైటాన్స్‌లోకి వెళ్లిన ఆఫ్ఘాన్ యంగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ఈ సీజన్‌లో మరోసారి 6.6 ఎకానమీతో బౌలింగ్‌ చేసి, టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు...

38

ఐపీఎల్ 2022 సీజన్‌లో సాధారణ ప్లేయర్‌గా బరిలో దిగిన విరాట్ కోహ్లీ, మళ్లీ మునపటిలా ఇరగదీస్తాడని అభిమానులు ఆశపడితే... 16 మ్యాచుల్లో కలిపి 341 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో రెండు సార్లు రనౌట్ అయ్యి, మరో రెండు సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు...

48
Image Credit: Getty Images

విరాట్ కోహ్లీ ఫామ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్. ‘విరాట్ కోహ్లీ సెంచరీ కోసం మీరు మాత్రమే కాదు, మేం కూడా ఎదురుచూస్తున్నాం. త్వరలోనే అతను సెంచరీ చేస్తాడు...

58

విరాట్ ఇప్పుడు 50, 60, 70 పరుగులను చేస్తున్నాడు. సెంచరీకి కావాల్సింది మరో 30 పరుగులే. అది కూడా త్వరలోనే వచ్చేస్తాయి. క్లిష్టమైన పిచ్‌ల మీద కోహ్లీ ఈజీగా పరుగులు చేస్తున్నాడు...

68

అందరూ విరాట్ కోహ్లీ ప్రతీ మ్యాచ్‌లోనూ సెంచరీ చేయాలని అభిమానులు కోరుకుంటారు. ప్రాక్టీస్ సెషన్స్‌లో విరాట్‌ని కలిసాను, చాలాసేపు మాట్లాడాను... నెట్స్‌లో అతను చాలా సమయం గడుపుతున్నాడు...

78

త్వరలోనే తన బ్యాటు నుంచి సంథింగ్ రాబోతుందని చెప్పాడు. త్వరలోనే మంచి ఇన్నింగ్స్ ఆడతానని చెప్పాడు. మంచి ఇన్నింగ్స్ ఆడడానికి కావాల్సిన కష్టం అతను పడుతున్నాడు... ’ అంటూ చెప్పుకొచ్చాడు రషీద్ ఖాన్...

88

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ నుంచి విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించారు సెలక్టర్లు. జూలై 1న ఇంగ్లాండ్‌తో జరిగే ఆఖరి టెస్టులో విరాట్ కోహ్లీ తిరిగి అంతర్జాతీయ మ్యాచులు ఆడబోతున్నాడు... 

Read more Photos on
click me!

Recommended Stories