ఐపీఎల్ 2022 కోసం సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు 2021 సీజన్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ రుతురాజ్ గైక్వాడ్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలను రిటైన్ చేసుకోనుంది చెన్నై సూపర్ కింగ్స్...
గత సీజన్‌లో 600+ పరుగులు చేసి, 2 పరుగుల తేడాతో ఆరెంజ్ క్యాప్ కోల్పోయిన సీఎస్‌కే మరో ఓపెనర్ ఫాఫ్ డుప్లిసిస్‌ను కూడా చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకోనుందని టాక్ వినిపించింది...
అయితే 37 ఏళ్ల ఫాఫ్ డుప్లిసిస్ మరో మూడేళ్ల పాటు క్రికెట్ ఆడుతాడా? లేదా? అనేది అనుమానమే. అందుకే డుప్లిసిస్‌ని రిటైన్ చేసుకునే ఆలోచనను విరమించుకుంది చెన్నై సూపర్ కింగ్స్...
సీఎస్‌కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ కూడా మహా అయితే వచ్చే సీజన్‌లో ఆడతాడని, ఆ తర్వాత అన్ని ఫార్మాట్ల నుంచి అతను రిటైర్మెంట్ తీసుకోవచ్చని టాక్ వినబడుతోంది...
‘ఎమ్మెస్ ధోనీ ఇంకెంత కాలం క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాడు. నాకు తెలిసి, అతను మహా అయితే వచ్చే సీజన్ ఆడొచ్చు. ఆ మాత్రం దానికి ఎమ్మెస్ ధోనీని రిటైన్ చేసుకోవడం అనవసరం...
నేనైతే ఎమ్మెస్ ధోనీని వేలానికి వదిలేసి, వేలంలో కొనుగోలు చేస్తా. ఇది చాలా కష్టమైన విషయమే కానీ ఐపీఎల్ లాంటి క్యాష్ లీగ్ ప్రపంచంలో ఇది చాలా పర్ఫెక్ట్ బిజినెస్ ఎత్తుగడ...
పర్సులో ఉన్న 15 శాతం డబ్బులను ఒకే ప్లేయర్‌పై, అదీ ఒకే ఆడాది ఆడే ప్లేయర్‌పై ఖర్చు పెట్టడం మాత్రం మూర్ఖత్వమే అవుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు బ్రాడ్ హాగ్...
బ్రాడ్ హాగ్, చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఫాఫ్ డుప్లిసిస్‌లను రిటైన్ చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు...
‘ఆర్‌సీబీకి అనేక సమస్యలు ఉన్నాయి. నాకు తెలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ, యజ్వేంద్ర చాహాల్, దేవ్‌దత్ పడిక్కల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లను రిటైన్ చేసుకోవచ్చు...
నేనైతే మ్యాక్స్‌వెల్‌ను ఓవర్‌సీస్ ప్లేయర్‌గా కాకుండా, అతన్ని కెప్టెన్‌గా చేస్తా. ఎందుకంటే అలా చేస్తే, వేలానికి వెళ్లే ముందు కెప్టెన్‌ని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు...
ఆర్‌సీబీ సెలక్టర్లు, గ్లెన్ మ్యాక్స్‌వెల్ నిలకడలేమిని చూసి భయపడొచ్చు. అతని పర్ఫామెన్స్ చూస్తే మాత్రం మ్యాక్సీకి కెప్టెన్సీ ఇవ్వడం కాస్త రిస్కే...’ అంటూ కామెంట్ చేశాడు బ్రాడ్ హాగ్..