సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకునేది ఈ నలుగురినే... కేన్ విలియంసన్ కంటే రషీద్ ఖాన్‌కి...

First Published Nov 27, 2021, 4:08 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో దారుణమైన పర్ఫామెన్స్‌తో క్రికెట్ ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరాశపరిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఎస్‌ఆర్‌హెచ్ టీమ్ పర్ఫామెన్స్ కంటే, జట్టులో జరిగిన మార్పులు, గొడవలు, వివాదాలు... హాట్ టాపిక్ అయ్యాయి... డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించిన ఆరెంజ్ ఆర్మీ, అతన్ని వేలానికి విడుదల చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే...

2016లో సన్‌‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి, గత ఆరేళ్లుగా ఆరెంజ్ ఆర్మీ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉంటూ వస్తున్న డేవిడ్ వార్నర్, వచ్చే ఏడాది కొత్త టీమ్ తరుపున ఆడడం దాదాపు ఖాయమైపోయింది...

మరి ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ అట్టిపెట్టుకునే ఆ నలుగురు ప్లేయర్లు ఎవరు? ఈ ప్రశ్నకు తన అభిప్రాయం చెప్పుకొచ్చాడు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్...

‘సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి డేవిడ్ వార్నర్ చేసిన సేవలను ఎప్పటికీ మరిచిపోలేం. అయితే అతన్ని జట్టు నుంచి తొలగించడానికి క్రికెట్ ఫామ్‌తో పాటు మరెదో కారణం కూడా ఉండి ఉండొచ్చు...

డేవిడ్ వార్నర్ జట్టులో లేకపోవడం సన్‌రైజర్స్‌కి నష్టమవుతుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే కొన్నేళ్లుగా ఒకే జట్టుకి ఆడిన ప్లేయర్‌, టీమ్‌కి విజయాలు అందించిన ప్లేయర్‌ను వదిలేస్తే... కొన్ని సమస్యలు తప్పక ఉంటాయి...

డేవిడ్ వార్నర్ కూడా మళ్లీ కొత్తగా ప్రయాణాన్ని మొదలెట్టాల్సి ఉంటుంది. అదీకాకుండా అతనికి పాతికేళ్లు లేవు. డేవిడ్ వార్నర్‌పై అంత మొత్తం వెచ్చించడం వృథా అని, మేనేజ్‌మెంట్ భావించవచ్చు...

అలా చూసుకుంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ కచ్ఛితంగా డేవిడ్ వార్నర్‌ను అట్టిపెట్టుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడదు. వాళ్లు కొత్త ప్లేయర్ కోసం చూస్తారు...

వార్నర్ లేకపోతే కేన్ విలియంసన్ కెప్టెన్. అయితే నాకు తెలిసి రషీద్ ఖాన్‌కి ఫస్ట్ రిటెన్షన్ ప్లేస్ ఇవ్వొచ్చు. ఎందుకంటే ఆ మొత్తానికి రషీద్ ఖాన్ అర్హుడు కూడా... 

అలా కాకుండా అతను వేరే జట్టు తరుపున ఆడాలని భావిస్తే మాత్రం కేన్ విలియంసన్, ఫస్ట్ రిటెన్షన్ అవుతాడు. భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్‌ను సన్‌రైజర్స్ వదులుకుంటుందని అనుకోను...

అయితే అతను ఈ మధ్యకాలంలో సరైన ఫామ్‌లో లేడు. భువీ లేదంటే ఖలీల్ అహ్మద్‌ను అట్టిపెట్టుకోవచ్చు, నటరాజన్ కూడా ఉన్నాడు. అయితే భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మాత్రం వీరికంటే ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్ బెటర్...

సమద్‌, ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలడు, కీలక సమయాల్లో వికెట్లు తీయగలడు. ఉమ్రాన్ మాలిక్ భవిష్యత్తులో టీమ్‌కి స్టార్ పర్ఫామర్ అవుతాడు...’అంటూ చెప్పుకొచ్చాడు ఇర్ఫాన్ పఠాన్...

2014 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన ఇర్ఫాన్ పఠాన్, ప్రస్తుతం ఆ జట్టులో అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ వంటి జమ్మూ కశ్మీర్ ప్లేయర్లకి మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు...

click me!