IPL 2022: ఎమ్మెస్ ధోనీ షాకింగ్ నిర్ణయం... అంత డబ్బు తనకి వద్దంటూ...

First Published Nov 27, 2021, 11:50 AM IST

ఐపీఎల్ 2022 సీజన్‌కి మెగా వేలానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఐపీఎల్ 2022 రిటెన్షన్ కార్యక్రమాన్ని నవంబర్ 30న నిర్వహించబోతున్నారు. అయితే సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఈ రిటెన్షన్ ప్రోగ్రామ్‌కి ముందు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు...

ఐపీఎల్ 2022 రిటెన్షన్ పాలసీ ప్రకారం ఇప్పటికే ఉన్న ఎనిమిది ఫ్రాంఛైజీలకి గరిష్టంగా నలుగురు పాత ప్లేయర్లను అట్టిపెట్టుకునేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది...

నలుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునేందుకు ఏదైనా ఫ్రాంఛైజీ నిర్ణయం తీసుకుంటే మొదటి రిటెన్షన్‌కి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్‌కి రూ.12 కోట్లు, మూడో ప్లేయర్‌కి 8 కోట్లు, నాలుగో ప్లేయర్‌కి రూ.6 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది...

తాము వాడే మొట్టమొదటి రిటెన్షన్ కార్డును మహేంద్ర సింగ్ ధోనీ కోసమే వాడతాడని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథ్, ఐపీఎల్ 2021 సమయంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే...

గత మూడేళ్లలో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఏటా రూ.15 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్న ఎమ్మెస్ ధోనీ, మొదటి రిటెన్షన్ కార్డు పొందితే ఇకపై ఏటా రూ.16 కోట్లు అందుకుంటాడు...

అయితే ఇప్పటికే 40వ ఏట అడుగుపెట్టిన ఎమ్మెస్ ధోనీ, మహా అయితే మరో సీజన్‌ మాత్రమే ఆడతాడని సమాచారం. ఈ ఏడాది తర్వాతే మాహీ రిటైర్మెంట్ తీసుకుంటాడని ప్రచారం జరిగింది...

అయితే స్వదేశంలో అదీ, సీఎస్‌కే సొంత సిటీ అయిన చెన్నైలోని ఏం.ఏ. చిదంబరం క్రికెట్ స్టేడియంలో అభిమానుల మధ్య ఆఖరి మ్యాచ్ ఆడతానని ప్రకటించాడు ఎమ్మెస్ ధోనీ...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫస్ట్ ప్లేయర్‌గా తనని రిటైన్ చేయకూడదని, ఓ యంగ్ ప్లేయర్‌కి ఆ అవకాశం దక్కితే బాగుంటుందని సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌కి సూచించాడట ఎమ్మెస్ ధోనీ...

ఈ విషయాన్ని సీఎస్‌కే యజమని ఎన్‌. శ్రీనివాసన్ తెలియచేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రుతురాజ్ గైక్వాడ్‌, రవీంద్ర జడేజాలతో ఫాఫ్ డుప్లిసిస్, లేదా మొయిన్ ఆలీలను రిటైన్ చేసుకోబోతున్నట్టు సమాచారం...

రవీంద్ర జడేజాకి ఫస్ట్ రిటెన్షన్‌గా, రుతురాజ్‌ గైక్వాడ్‌కి రెండో రిటెన్షన్‌గా తీసుకుని మూడో ఛాయిస్‌గా ఎమ్మెస్ ధోనీని తీసుకోబోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి...

ఇప్పటికే ఐపీఎల్ ద్వారా రూ.150+ కోట్లు ఆర్జించిన ఏకైక ప్లేయర్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, మూడో ఛాయిస్ రిటైన్షన్‌గా ఎంపికైతే కేవలం రూ.8 కోట్లు తీసుకోవాల్సి ఉంటుంది...

ఐపీఎల్ 2020 సీజన్‌కి ముందు వేలంలో పాల్గొనాలని, తనకు ఎంత ధర పలుకుతుందో తెలుసుకోవాలని ఆశపడిన ఎమ్మెస్ ధోనీ, ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విశేషం...

click me!