రాయల్స్ కథ వేరే ఉందిగా... టేబుల్ టాపర్, పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ అన్నీ వారి దగ్గరే...

Published : Apr 11, 2022, 06:12 PM IST

ఐపీఎల్‌ ఆరంగ్రేట సీజన్‌లో టైటిల్ గెలిచిన తర్వాత మళ్లీ ఫైనల్ చేరలేకపోయింది రాజస్థాన్ రాయల్స్. 2008 తర్వాత మూడు సార్లు ఫ్లేఆఫ్స్ చేరినా, టైటిల్ గెలవలేకపోయింది. అయితే ఈసారి మాత్రం రాయల్స్ ఆటతీరు వేరే లెవెల్‌లో సాగుతోంది...

PREV
19
రాయల్స్ కథ వేరే ఉందిగా... టేబుల్ టాపర్, పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ అన్నీ వారి దగ్గరే...

అజింకా రహానే కెప్టెన్సీలో 2019 సీజన్‌ని ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్, వరుస పరాజయాల తర్వాత స్టీవ్ స్మిత్‌కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. అయినా ఏడో స్థానాన్ని దాటి ముందుకు వెళ్లలేకపోయింది...

29

ఐపీఎల్ 2020 సీజన్‌లో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఆడిన రాజస్థాన్ రాయల్స్, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఆర్ఆర్ ఆఖరి స్థానంలో నిలవడం ఇదే తొలిసారి...

39
Sanju Samson

గత సీజన్‌లో సంజూ శాంసన్‌కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది రాజస్థాన్ రాయల్స్. బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, జోస్ బట్లర్ (సెకండ్ ఫేజ్‌లో) అందుబాటులో లేకపోయినా కాస్త మెరుగైన పర్ఫామెన్స్ ఇచ్చిన రాయల్స్, ఏడో స్థానానికి పరిమితమైంది...

49

ఐపీఎల్ 2022 మెగా వేలంలో మిగిలిన జట్లకంటే మెరుగ్గా వ్యవహరించిన మేనేజ్‌మెంట్, స్టార్ ప్లేయర్లను, మ్యాచ్ విన్నర్లను కొనుగోలు చేసింది... దాని ఫలితం సీజన్ మొదటి వారంలోనే కనిపించింది...

59

సిమ్రాన్ హెట్మయర్, దేవ్‌దత్ పడిక్కల్, జిమ్మీ నీశమ్, జోస్ బట్లర్, యజ్వేంద్ర చాహాల్, రవిచంద్రన్ అశ్విన్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్ వంటి స్టార్లను కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్...

69

ఐపీఎల్ 2022 సీజన్‌లో మొదటి నాలుగు మ్యాచుల్లో మూడింట్లో ఘన విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది...

79

అలాగే ఐపీఎల్ 2022 సీజన్‌లో మొట్టమొదటి సెంచరీ నమోదుచేసిన జోస్ బట్లర్, 4 మ్యాచుల్లో 218 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో ఉన్నాడు...

89
Chahal-Sanju Samson

అలాగే ఆర్‌సీబీ నుంచి ఆర్ఆర్‌కి వచ్చిన యజ్వేంద్ర చాహాల్ 4 మ్యాచుల్లో 11 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో టాప్‌లో నిలిచాడు. 

99

ప్రస్తుతానికి టేబుల్ టాప్ పొజిషన్‌లో ఉన్న రాయల్స్ దగ్గరే ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఉండడం విశేషం. ఈ ఆటతీరు ఇలాగే కొనసాగితే ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్స్... బెటర్ పర్ఫామెన్స్ ఇవ్వడం ఖాయమంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్... 

click me!

Recommended Stories