విరాట్‌కైనా టైమ్ పట్టింది, రోహిత్ శర్మకి ఆరంభంలోనే... టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాక...

Published : Apr 06, 2022, 08:47 PM IST

రోహిత్ శర్మ, ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఐదుసార్లు టైటిల్ గెలిచిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ సారథి. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలోనూ బాధ్యతలు అందుకున్నాడు రోహిత్. అయితే కెప్టెన్‌గా ఎంపికయ్యాక రోహిత్ ఆటతీరులో చాలా మార్పు వచ్చింది...

PREV
111
విరాట్‌కైనా టైమ్ పట్టింది, రోహిత్ శర్మకి ఆరంభంలోనే... టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాక...
Rohit Sharma

ధనాధన్ హిట్టింగ్‌తో వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు, టీ20ల్లో నాలుగు సెంచరీలు నమోదు చేసిన రోహిత్ శర్మ... ‘హిట్ మ్యాన్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు...

211
Image Credit: Getty Images

టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రోహిత్ శర్మ, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలు చేసి అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు...

311

ఆ తర్వాత న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ, గాయంతో సౌతాఫ్రికా టూర్‌కి దూరమయ్యాడు. అప్పటి నుంచి రోహిత్ బ్యాటు నుంచి మెరుపులు రావడం లేదు...

411

వెస్టిండీస్‌తో, శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో క్లీన్ స్వీప్ విజయాలు అందుకున్న రోహిత్ శర్మ, బ్యాటుతో మాత్రం చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఒక్కటీ ఇవ్వలేకపోయాడు...

511
Rohit Sharma

ఐపీఎల్ 2022 సీజన్‌లోనూ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతూ వస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు రోహిత్ శర్మ...

611

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 బంతుల్లో 10 పరుగులు చేసిన రోహిత్, కేకేఆర్‌తో మ్యాచ్‌లో 12 బంతులాడి కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు...

711
Image Credit: Getty Images

మూడు ఫార్మాట్లలో టీమిండియా సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ, ఆ ప్రెషర్‌ కారణంగానే బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్నాడని అంటున్నారు ఫ్యాన్స్...

811

ఇంతకుముందు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, ఎమ్మెస్ ధోనీ కూడా కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోయారు...

911

విరాట్ కోహ్లీ ఆరంభంలో అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాట్స్‌మెన్‌గా అదరగొట్టాడు. 2019 తర్వాత విరాట్ కోహ్లీ కూడా పేలవ ఫామ్‌తో విమర్వలు ఎదుర్కొన్నాడు. ఆ కారణంగానే కెప్టెన్సీ కూడా వదులుకోవాల్సి వచ్చింది...

1011
Image Credit: Getty Images

34 ఏళ్ల వయసులో టీమిండియా కెప్టెన్సీ తీసుకున్న రోహిత్ శర్మపై భారీ అంచనాలే పెట్టుకుంది బీసీసీఐ. 2022 టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ని రోహిత్, భారత జట్టుకి అందిస్తాడని ఆశలు పెట్టుకుంది...

1111

అయితే రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫెయిల్యూర్ ఇలాగే కొనసాగితే అది టీమ్ పర్ఫామెన్స్‌పై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. అప్పుడు విరాట్ పరిస్థితులనే రోహిత్ కూడా ఫేస్ చేయాల్సి రావచ్చు... 

Read more Photos on
click me!

Recommended Stories