మాహీ నీ క్రేజ్‌కి సలాం.. ధోనీ ఎంట్రీతో దద్దరిల్లిన వాంఖడే... ‘బాహుబలి’ సీన్‌ని తలపించేలా...

First Published Apr 26, 2022, 6:39 PM IST

సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకున్న క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. టీమిండియాకి మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన కెప్టెన్‌గా, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మాహీకి బీభత్సమైన ఫాలోయింగ్, క్రేజ్ వచ్చింది...

Image Credit: Getty Images (File Photo)

ఐపీఎల్ 2022 సీజన్ కోసం సూరత్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. దీంతో అక్కడ ట్రాఫిక్‌ని నియంత్రించేందుకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది...

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో మిగిలిన మ్యాచుల కంటే సీఎస్‌కే ఆడే మ్యాచులకు మంచి టీఆర్పీ దక్కుతోంది. అందులోనూ మాహీ క్రీజులో ఉన్న సమయంలో టీఆర్పీ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోతోంది...

Latest Videos


ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో చివరి 4 బంతుల్లో 16 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఈ సమయంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రియల్ టైం వ్యూస్ 8.3 మిలియన్లను తాకాయి...

అలాగే ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్‌తో సీఎస్‌కే ఆడిన మ్యాచుల్లోనూ హాట్ స్టార్ వ్యూస్ 8 మిలియన్లను దాటాయి. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇదే అత్యధికం. ముంబై మ్యాచ్‌లకు కూడా ఈ స్థాయిలో వ్యూయర్‌షిప్ దక్కడం లేదు...

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయానికి 27 పరుగులు కావాల్సిన దశలో క్రీజులోకి అడుగుపెట్టాడు మహేంద్ర సింగ్ ధోనీ. మాహీకి కరతాళ ధ్వనులతో, కేకులు, అరుపులతో ‘బాహుబలి’, ‘మగధీర’ సినిమాల్లో సీన్‌ల లెవెల్లో ఘన స్వాగతం పలికారు వాంఖడే స్టేడియానికి హాజరైన ప్రేక్షకులు...

కామెంటరీ బాక్సులో ఉన్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్, స్టేడియం ఒక్కసారిగా అరుపులు, కేకలతో దద్దరిల్లిపోవడంతో ఆశ్చర్యపోయి బయటికి చూశాడట. బ్యాటింగ్‌కి వస్తున్న మాహీకి ఈ లెవెల్‌లో స్వాగతం చెబుతుండడం చూసి షాక్ అయ్యాడట కేపీ.

‘మాహీ నీ క్రేజ్ నమ్మశక్యం కానట్టుగా ఉంది. ఇది అద్భుతం. ఇలాంటి రెస్పాన్స్, నేనెప్పుడూ చూడలేదు. అందుకే ఐపీఎల్ ఇండియాలో జరగాలి.. ఇంత ఎనర్జీ, ఇంత ఉత్సహం.. మరో క్రికెటర్ దక్కించుకోవడం అసాధ్యమే..

ఇప్పుడు ధోనీ కెప్టెన్ కూడా కాదు. అలాగే కరోనా నిబంధనల కారణంగా స్టేడియంలో పూర్తి జనం కూడా లేరు. అయినా ఇంతలా ఓ ప్లేయర్‌ని ఆరాధిస్తున్నారంటే... ఆ క్రికెటర్‌ ఎంతో సాధించి ఉండాలి..’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కేవిన్ పీటర్సన్.. 

click me!