TATA IPL 2022: పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో పలు రికార్డులను బ్రేక్ చేశాడు. ఐపీఎల్ లో 200వ మ్యాచ్ ఆడుతున్న ఈ గబ్బర్.. విరాట్ కోహ్లి సరసన చేరడమే గాక రోహిత్ శర్మ రికార్డును తుడిపేశాడు.
ఐపీఎల్-2022 లో భాగంగా సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ ఆడిన పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఐపీఎల్ లో శిఖర్ కు ఇది 200వ మ్యాచ్. 200, ఆ పైగా మ్యాచులు ఆడిన ఎనిమిదో భారత క్రికెటర్ ధావన్.
26
అంతకుముందు ఈ జాబితాలో ఎంఎస్ ధోని (228), దినేశ్ కార్తీక్ (221), రోహిత్ శర్మ (221), విరాట్ కోహ్లి (215), రవీంద్ర జడేజా (208), రాబిన్ ఊతప్ప (201) మ్యాచులాడారు.
36
చెన్నైతో మ్యాచ్ లో 88 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన గబ్బర్.. ఒకే ఫ్రాంచైజీపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. చెన్నైపై 88 పరుగులతో కలిపి ఆ జట్టుపై మొత్తంగా అతడు 1,022 రన్స్ చేశాడు.
46
ఈ జాబితాలో రోహిత్ శర్మ (కేకేఆర్ పై 1,018) రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో డేవిడ్ వార్నర్ (1,005.. పంజాబ్ పై) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
56
కాగా ఈ మ్యాచ్ లో 88 పరుగులు సాధించడం ద్వారా ధావన్ టీ20 (అంతర్జాతీయ, ఐపీఎల్) లలో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతేగాక ఐపీఎల్ లో 6 వేల పరుగుల క్లబ్ లో కూడా చేరాడు.
66
ఐపీఎల్ లో 6 వేల పరుగులు చేసిన రెండో క్రికెటర్ గా ధావన్ (6,086 రన్స్) చేరాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ సారథి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లి (6,402) అందరికంటే ముందున్నాడు.