ముంబై- చెన్నై మ్యాచ్‌ని ఇండో పాక్ మ్యాచ్‌తో పోల్చిన హర్భజన్ సింగ్... ఇంతకీ పాకిస్తాన్ ఏ టీమ్ భజ్జీ అంటూ...

Published : Apr 21, 2022, 06:07 PM ISTUpdated : Apr 21, 2022, 06:09 PM IST

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అందులోనూ ఈ సీజన్‌లో ఇరు జట్లూ కలిసి మొదటి 12 మ్యాచుల్లో ఒకే మ్యాచ్ గెలవడంతో ఈసారి ఆ అంచనాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్‌లో ఈ ఎల్ క్లాస్‌కో గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు హర్భజన్ సింగ్...

PREV
18
ముంబై- చెన్నై మ్యాచ్‌ని ఇండో పాక్ మ్యాచ్‌తో పోల్చిన హర్భజన్ సింగ్... ఇంతకీ పాకిస్తాన్ ఏ టీమ్ భజ్జీ అంటూ...

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ అయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్ల తరుపున ఆడిన భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్... ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు రిటైర్మెంట్ ప్రకటించాడు...

28

‘నేను 10 ఏళ్ల పాటు ముంబై ఇండియన్స్‌ డ్రెస్సింగ్ రూమ్‌ షేర్ చేసుకున్న తర్వాత, మొదటిసారి సీఎస్‌కే జెర్సీ వేసుకోవడం కొంచెం వింతగా, కొత్తగా అనిపించింది...

38

నా ఈ రెండు జట్లూ చాలా స్పెషల్. ఐపీఎల్‌లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ నాకు భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌ని తలపిస్తుంది. కాంపిటీషన్, క్రేజ్, శత్రుత్వం ఆ రేంజ్‌లో ఉంటుంది...

48

ముంబై ఇండియన్స్‌కి ప్రత్యర్థిగా మొదటిసారి క్రీజులో అడుగుపెట్టినప్పుడు... ఆ మ్యాచ్ త్వరగా ముగిసిపోవాలని దేవుడిని కోరుకున్నా. ఎందుకంటే ముంబైతో నాకు స్పెషల్ ఎమోషన్స్ ఉన్నాయి...

58

సొంత జట్టులాంటి టీమ్‌కి ప్రత్యర్థి ఆటగాడిగా దిగడం చాలా కష్టంగా ఉంటుంది. ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఆ మ్యాచ్ కోరుకున్నట్టే త్వరగానే పూర్తయ్యింది. సీఎస్‌కే గెలిచింది...’ అంటూ కామెంట్ చేశాడు హర్భజన్ సింగ్...

68

ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ని భారత్- పాక్ మ్యాచ్‌తో పోల్చడంతో కొందరు ఫ్యాన్స్, భజ్జీని ట్రోల్ చేస్తున్నారు... మరి ముంబై, చెన్నైలలో ఏది భారత్, ఏది పాకిస్తాన్‌ అనేది చెప్పాలని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు...  

78

గత 9 సీజన్లలో ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఫోర్ టైమ్ ఐపీఎల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్‌పై తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది...

88

ఇప్పటిదాకా ఇరు జట్ల మధ్య ఐపీఎల్‌లో రికార్డు స్థాయిలో 32 మ్యాచులు జరిగాయి. వీటిల్లో 19 మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించగా 13 మ్యాచుల్లో సీఎస్‌కే విజయం వరించింది..

click me!

Recommended Stories