ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో సతమతమవుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నారు. అయితే ఈ ఇద్దరికీ అరుదైన ఘనత దక్కింది...
విజ్డెన్ 2022 ఏడాదికి గాను ప్రకటించిన టాప్ 5 క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రాలకు చోటు దక్కింది. గత ఏడాది మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన ప్లేయర్లను ఎంపిక చేసింది విజ్డెన్...
28
2021లో మొత్తంగా 21 టెస్టు మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, 906 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 3 వన్డేలాడి 90 పరుగులు చేసిన రోహిత్, 11 టీ20 మ్యాచుల్లో 424 పరుగులు చేశాడు...
38
జస్ప్రిత్ బుమ్రా 13 టెస్టుల్లో 47 వికెట్లు తీయగా బ్యాటింగ్‌లోనూ 136 పరుగులు చేసి రాణించాడు. 5 టీ20 మ్యాచుల్లో 7 వికెట్లు తీశాడు...
48
న్యూజిలాండ్ క్రికెటర్ డివాన్ కాన్వే 7 టెస్టుల్లో 63.91 సగటుతో 767 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి... డివాన్ కాన్వే కూడా విజ్డేన్ టాప్ 5 ప్లేయర్లలో ఒకడిగా చోటు దక్కింది.
58
గత ఏడాది ఇంగ్లాండ్ తరుపున ఆరంగ్రేటం చేసిన యంగ్ పేసర్ ఓల్లీ రాబిన్‌సన్, 8 ఏళ్ల క్రితం వేసిన జాతివివక్ష ట్వీట్ల కారణంగా ఓ మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. 9 మ్యాచుల్లో 39 వికెట్లు తీసిన రాబిన్‌సన్, 2 సార్లు ఐదేసి వికెట్ల ప్రదర్శన ఇచ్చాడు...
68
సౌతాఫ్రికా మహిళా క్రికెటర్ డేన్ వాన్ నీకెర్క్‌కి కూడా విజ్డేన్ టాప్ 5 క్రికెటర్ల జాబితాలో చోటు దక్కింది. డేన్ ఇప్పటిదాకా 107 వన్డేలు, 86 టీ20 మ్యాచులు ఆడింది. ఓవరాల్‌గా 4 వేలకు పైగా పరుగులు చేసింది...
78
గత ఏడాది 6 టెస్టు సెంచరీలతో 1700+ పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసిన ఇంగ్లాండ్ మాజీ టెస్టు కెప్టెన్ జో రూట్... విజ్డేన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు..
88
2021 ఫిబ్రవరి నుంచి 2022 ఏప్రిల్ వరకూ 14 నెలల కాలంలో 8 టెస్టు సెంచరీలు చేసిన జో రూట్... ఇంగ్లాండ్‌కి కేవలం రెండు విజయాలు మాత్రమే అందించగలిగాడు. దీంతో గత వారంలోనే టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు జో రూట్...