శ్రేయాస్ అయ్యర్‌కి జాక్ పాట్... ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి డేవిడ్ వార్నర్... తొలి సెట్‌ ప్లేయర్లలో...

Published : Feb 12, 2022, 01:17 PM IST

ఐపీఎల్ 2022 మెగా వేలంలో తొలి సెట్‌ వేలం ముగిసింది. మార్క్యూరీ సెట్‌లో ఉన్న సీనియర్ల కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్ 2022 సీజన్‌లో కేకేఆర్‌ను నడిపించబోతున్నాడు...

PREV
110
శ్రేయాస్ అయ్యర్‌కి జాక్ పాట్... ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి డేవిడ్ వార్నర్... తొలి సెట్‌ ప్లేయర్లలో...

ఐపీఎల్ 2022లో మెగా వేలానికి వచ్చిన మొదటి ప్లేయర్‌గా శిఖర్ ధావన్ నిలిచాడు. గబ్బర్ కోసం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి. మధ్యలో పోటీకి వచ్చిన పంజాబ్ కింగ్స్  రూ.8.25 కోట్లకు శిఖర్ ధావన్‌ను దక్కించుకుంది...

210

రవిచంద్రన్ అశ్విన్ కోసం కూడా ఆసక్తికర పోటీ నడిచింది. అశ్విన్‌ని రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. మన్కడింగ్ వివాదం రేగిన జోస్ బట్లర్, రవి అశ్విన్, 2022 సీజన్‌లో ఒకే జట్టుకి ఆడబోతున్నారు...

310

శ్రేయాస్ అయ్యర్ కోసం విపరీతమైన పోటీ జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా శ్రేయాస్ అయ్యర్ కోసం ఆసక్తి చూపినా కేకేఆర్ రూ.12.25 కోట్లకు అతన్ని దక్కించుకుంది... ఐపీఎల్ 2022 సీజన్‌లో కేకేఆర్‌ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ నియమించబడడం ఖాయంగా మారింది...

410

ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున 2020 సీజన్‌లో పర్పుల్ క్యాప్ గెలిచిన కగిసో రబాడాని పంజాబ్ కింగ్స్ జట్టు రూ.9.25 కోట్లకు కొనుగోలు చేసింది.  

510

ముంబై ఇండియన్స్‌లో ఉన్న న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను రూ.8 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ముంబై, బౌల్ట్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నించినా, రాయల్స్ జోరు ముందు నిలవలేక పోటీ నుంచి తప్పుకుంది.

610

ఐపీఎల్ 2020 వేలంలో రూ.15.5 కోట్లకు ప్యాట్ కమ్మిన్స్‌ను కొనుగోలు చేసిన కేకేఆర్, తిరిగి అతన్ని సొంతం చేసుకుంది. ఐపీఎల్ మెగా వేలంలో రూ.7.25 కోట్లకు కమ్మిన్స్‌ను తిరిగి జట్టులోకి తెచ్చుకుంది కేకేఆర్... 

710

చెన్నై సూపర్ కింగ్స్‌కి ఓపెనర్‌గా రానించిన ఫాఫ్ డుప్లిసిస్‌ను రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... 

810

భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్‌కి ఆడబోతున్నాడు. షమీని రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్...

910

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడబోతున్నాడు. డేవిడ్ వార్నర్‌ను రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది ఢీసీ...

1010

ముంబై ఇండియన్స్ మాజీ ఓపెనర్ క్వింటన్ డి కాక్‌ను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది...

click me!

Recommended Stories