మా ఆవిడ కొట్టింది, అమ్మ తిట్టింది, క్షమించండి... పక్కింటోడి భార్య కామెంట్లపై దినేశ్ కార్తీక్...

First Published Jul 5, 2021, 9:03 AM IST

కామెంటేటర్‌గా అవతారం ఎత్తిన భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ చేసిన పక్కింటోడి పెళ్లాం కామెంట్లపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. మహిళా సంఘాల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన రావడంతో దినేశ్ కార్తీక్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరాడు...

‘గత మ్యాచ్‌లో జరిగిన దానికి నేను క్షమాపణలు చెబుతున్నా.. నేను ఉద్దేశపూర్వకంగా అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నేను చెప్పాలనుకున్నది వేరు, చెప్పింది వేరు... అందరికీ క్షమాపణలు చెబుతున్నా...
undefined
అలా చెప్పడం నిజంగా కరెక్ట్ కాదు... మళ్లీ ఇలాంటి జరగవని హామీ ఇస్తున్నా. ఇప్పటికే మా ఆవిడ నన్ను చితక్కొట్టింది, మా అమ్మ ఫుల్లుగా తిట్టింది అలా మాట్లాడినందుకు’ అంటూ ట్వీట్లు చేశాడు దినేశ్ కార్తీక్...
undefined
అంతర్జాతీయ క్రికెట్‌కి ఇంకా రిటైర్మెంట్ ప్రకటించకముందే కామెంటేటర్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్, తనదైన స్టైల్‌లో కామెంటరీ చెబుతూ ఇప్పటికీ సెంట్ మార్కులు కొట్టేశాడు.
undefined
అయితే ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డేలో డీకే చేసిన ఓ కామెంట్ తీవ్ర వివాదాస్పదమైంది... డబ్ల్యూటీసీ ఫైనల్‌కి కామెంటరీ చెప్పడానికి ఇంగ్లాండ్ వెళ్లిన దినేశ్ కార్తీక్, అక్కడే ఉండి ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరుగుతున్న వన్డే, టీ20 మ్యాచులకు కూడా కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.
undefined
తొలి రెండు వన్డేల్లో శ్రీలంకను చిత్తు చేసింది ఇంగ్లాండ్ జట్టు. అయితే రెండో వన్డేలో టెస్టు కెప్టెన్ జో రూట్, వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ క్రీజులో ఉన్న సమయంలో దినేశ్ కార్తీక్ చేసిన ఓ కామెంట్ హాట్ టాపిక్ అయ్యింది...
undefined
‘బ్యాటులు ఎప్పుడూ పక్కింటోడి పెళ్లాంలాంటివి. ఎప్పుడూ పక్కవాడివే బాగున్నట్టు అనిపిస్తాయి...’ అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మహిళలు, నెటిజన్లు...
undefined
భార్యలకు కూడా ఓ వ్యక్తిత్వం ఉంటుందని మరిచిపోయి, వాళ్లను బ్యాటులతో పోల్చడాన్ని పురుషాధిక్యానికి, పురుషాహంకారానికి నిదర్శనమనికొందరు మహిళా సంఘాల వాళ్లు ఆరోపణలు చేశారు...
undefined
బ్యాటు అనేది ఓ క్రికెటర్‌కి సంబంధించిన వస్తువు లేదా ఆస్తి అని... అలాగే భార్యని కూడా భర్త ప్రోపర్టీ అనే అర్థం వచ్చేలా దినేశ్ కార్తీక్ చేసిన కామెంట్లు ఉన్నాయి. వెంటనే మహిళలందరికీ దినేశ్ కార్తీక్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
undefined
‘దినేశ్ కార్తీక్ అపాలజీ’ పేరుతో హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తన కామెంటరీతో పాజిటివ్‌గా ట్రెండ్ అయిన దినేశ్ కార్తీక్, ఆ తర్వాత కొన్నిరోజులకే ఇలా సెక్సిజం కామెంట్లతో వార్తల్లో నిలిచాడని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
undefined
click me!