ఎమ్మెస్ ధోనీ కంటే అనిల్ కుంబ్లే బెస్ట్ కెప్టెన్... గౌతమ్ గంభీర్ హాట్ కామెంట్...

First Published May 23, 2022, 10:42 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో మెంటర్‌గా కొత్త అవతారం ఎత్తాడు గౌతమ్ గంభీర్. లక్నో సూపర్ జెయింట్స్‌కి మెంటర్‌గా వ్యవహరిస్తున్న గంభీర్, కెఎల్ రాహుల్‌ టీమ్‌ని ప్లేఆఫ్స్‌కి చేర్చగలిగాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియాకి మెంటర్‌గా గంభీర్‌ని వేయాలంటూ కొందరు డిమాండ్లు కూడా చేస్తున్నారు..

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియాకి మెంటర్‌గా వ్యవహరించాడు ఎమ్మెస్ ధోనీ. ప్రాక్టీస్ మ్యాచుల్లో దుమ్మురేపిన భారత జట్టు, అసలైన మ్యాచుల్లో చేతులు ఎత్తేసింది..

Gautam Gambhir

దీంతో ఎమ్మెస్ ధోనీని ద్వేషించేవారికి ఫెవరెట్‌గా మారిన గౌతమ్ గంభీర్‌, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియాకి మెంటర్‌గా మారితే బాగుంటుందని పోస్టులు చేస్తున్నారు...

తాజాగా ఎమ్మెస్ ధోనీపై తనకున్న కోపాన్ని మరోసారి బయటపెట్టాడు గౌతమ్ గంభీర్. ‘రికార్డుల ప్రకారం చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ గొప్ప కెప్టెన్లు అయ్యుండొచ్చు. అయితే నా ఉద్దేశంతో వీరిద్దరి కంటే అనిల్ కుంబ్లే బెస్ట్ కెప్టెన్..

నిజమే నేను ధోనీ కెప్టెన్సీలో ఎక్కువ పరుగులు చేశాను, ఎక్కువ మ్యాచులు ఆడాను. అనిల్ కుంబ్లే కెప్టెన్సీలో ఆడింది ఆరు మ్యాచులే. అయితే ధోనీలా సుదీర్ఘ కాలం కుంబ్లే కెప్టెన్‌గా ఉండి ఉంటే, రిజల్ట్ వేరేగా ఉండేది...

Anil Kumble, Gautam Gambhir

అనిల్ కుంబ్లే ముందుగానే టెస్టు కెప్టెన్సీ  తీసుకుని ఉంటే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసేవారు. సౌరవ్ గంగూలీలా, ఎమ్మెస్ ధోనీ మంచి కెప్టెన్. అయితే కుంబ్లే కెప్టెన్సీ స్టైల్ వేరు...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...

అనిల్ కుంబ్లే కెప్టెన్సీలో ఆరు టెస్టులు మాత్రమే ఆడిన గౌతమ్ గంభీర్, ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో జట్టులో చోటు కోల్పోయి రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు..

click me!