ముందు ఆ అనిల్ కుంబ్లేని తీసేయండి... పంజాబ్ కింగ్స్ పర్ఫామెన్స్‌పై ఫ్యాన్స్ ఫైర్...

Published : May 23, 2022, 06:35 PM IST

ఐపీఎల్‌లో అత్యధిక మంది కెప్టెన్లను మార్చిన టీమ్ పంజాబ్. 15 సీజన్లుగా టైటిల్ గెలవలేకపోయిన పంజాబ్... టీమ్ పేరు మార్చినా, లోగో మార్చినా, జెర్సీ రంగు మార్చినా... ఎంత మంది కెప్టెన్లను మార్చినా పర్పామెన్స్‌లో మాత్రం మార్పు కనిపించడం లేదు...

PREV
110
ముందు ఆ అనిల్ కుంబ్లేని తీసేయండి... పంజాబ్ కింగ్స్ పర్ఫామెన్స్‌పై ఫ్యాన్స్ ఫైర్...

2008 సీజన్‌లో యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో ప్లేఆఫ్స్‌కి చేరిన పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత 2014 వరకూ నాకౌట్ స్టేజ్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది... 2014లో జార్జ్ బెయిలీ కెప్టెన్సీలో మొట్టమొదటి సారి ఫైనల్ చేరిన పంజాబ్, ఆఖరాటలో బోల్తాపడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది...

210
Punjab Kings

2015, 2016 సీజన్లలో 8వ స్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్... 2010 సీజన్‌ని ఆఖరి స్థానంలో ముగించింది. అత్యధిక సార్లు ఆఖరి పొజిషన్‌లో నిలిచిన జట్టుగా ఢిల్లీ తర్వాతి స్థానంలో నిలిచింది...

310

అయితే ఢిల్లీ క్యాపిటల్స్ గత నాలుగు సీజన్లలో మూడు సార్లు ప్లేఆఫ్స్‌కి, ఓ సారి ఫైనల్‌కి చేరింది. అయితే పంజాబ్ కింగ్స్ కథ మాత్రం మారడం లేదు. గత నాలుగు సీజన్లలోనూ పంజాబ్ కింగ్స్ ఆరో స్థానంలోనే ముగించింది...

410

గత రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్‌కి రూ.15-16 కోట్లు ఇస్తామని చెప్పినా వినకుండా లక్నోకి రూ.17 కోట్లతో వెళ్లిపోయాడు. దీంతో గత సీజన్‌లో ఓ మ్యాచ్‌లో కెప్టెన్సీ అదరగొట్టిన మయాంక్ అగర్వాల్‌ని నమ్మి కెప్టెన్సీ ఇచ్చింది పంజాబ్ కింగ్స్...

510

ప్లేయర్లతో హెడ్ మాస్టర్‌లా వ్యవహరించే అనిల్ కుంబ్లే తత్వం నచ్చకే కెఎల్ రాహుల్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌కి వెళ్లిపోయాడని అంటున్నారు మరికొందరు... 

610

మయాంక్ అగర్వాల్ కూడా పంజాబ్ కింగ్స్ ఫేట్‌ని మార్చలేకపోయాడు. ఒకానొక దశలో లియామ్ లివింగ్‌స్టోన్ టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో టాప్‌లో నిలిచిన పంజాబ్ కింగ్స్, కీలక మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది...
 

710

ఎన్ని చేసినా పంజాబ్ కింగ్స్ ఫలితం మారకపోవడంతో హెడ్ కోచ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ అనిల్ కుంబ్లేని ఆ పొజిషన్ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రీతి జింటా ఫ్యాన్స్...

810

టీమిండియా హెడ్ కోచ్‌గా చేసిన సమయంలో కోహ్లీతో గొడవపడి, భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో చిత్తుగా ఓడడానికి కారణమైన కుంబ్లే, పంజాబ్ కింగ్స్‌కి టైటిల్ ఎలా ఇవ్వగలడంటూ ట్రోల్స్ చేస్తున్నారు విరాట్ ఫ్యాన్స్...

910

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఓడియన్ స్మిత్, షారుక్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, జితేశ్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, కగిసో రబాడా, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ, రాహుల్ చాహార్ వంటి మ్యాచు విన్నర్లు ఉన్నా పంజాబ్ కింగ్స్... మళ్లీ ఆరో స్థానంలోనే ముగించడానికి కారణం వారి బ్యాడ్ లక్కే అంటున్నారు మరికొందరు...

1010

అన్నీ బానే ఉన్నా టీమ్ కాంబినేషన్‌ విషయంలో పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ శ్రద్ధ పెట్టకపోవడం, ప్లేయర్లను తరుచూ మారుస్తూ ఓ స్థిరమైన జట్టును ఏర్పరచకపోవడమే ఆ జట్టు ఫెయిల్యూర్‌కి కారణమంటున్నారు క్రికెట్ విశ్లేషకులు... 

click me!

Recommended Stories