ప్లేఆఫ్స్ బెర్త్ కోసం అన్నదమ్ముల పోరు... పెద్దనాన్నకి సపోర్ట్ చేస్తున్న హార్ధిక్ పాండ్యా కొడుకు...

First Published May 10, 2022, 5:09 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన కొత్త జట్లు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ అంచనాలకు మించి అదరగొడుతున్నాయి. ఇప్పటికే ఇరు జట్లూ చెరో 8 మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచాయి...

ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండోసారి లక్నో సూపర్ జెయింట్స్‌తో తలబడబోతోంది గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్ ఫలితం అధికారికంగా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించే మొట్టమొదటి జట్టును ఖరారు చేయనుంది...

8 విజయాలతో సమానంగా ఉన్న ఇరుజట్లు, ఇంకో మ్యాచ్ గెలిస్తే మిగిలిన ఫ్రాంఛైజీలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌కి చేరతాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు జట్ల మధ్యే జరుగుతుండడంతో గెలిచిన టీమ్, ప్లేఆఫ్స్‌కి చేరనుంది...

గత సీజన్లలో ముంబై ఇండియన్స్‌కి కలిసి ఆడిన పాండ్యా బ్రదర్స్ హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా... ఈ సీజన్‌లో వేర్వేరు జట్ల తరుపున బరిలో దిగుతున్నారు. 

హార్ధిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటే, అన్న కృనాల్ పాండ్యా లక్నో సూపర్ జెయింట్స్‌లో కీలక సభ్యుడిగా ఉన్నాడు...

తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌కి ముందు హార్ధిక్ పాండ్యా కొడుకు అగస్త్య పాండ్యా, లక్నో సూపర్ జెయింట్స్‌లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు కృనాల్ పాండ్యా... ‘ఈసారి నా లక్కీ బుడ్డోడు నాకు సపోర్ట్ చేస్తున్నాడు...’ అంటూ కాప్షన్ ఇచ్చాడు కృనాల్ పాండ్యా..

నేటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ గెలిస్తే నాలుగో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ టాప్ 2లోకి వచ్చేందుకు ఛాన్సులు పెరుగుతాయి. అదే గుజరాత్ టైటాన్స్ గెలిస్తే మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, టాప్ 2లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశాలు పెరుగుతాయి...

అన్నాదమ్ముల మధ్య తొలి సమరంలో తమ్ముడు ఘన విజయం అందుకున్నా, ఈసారి అగస్త్య సపోర్ట్‌తో హార్ధిక్ పాండ్యాపై రివెంజ్ తీర్చుకుంటానని అంటున్నాడు అన్న కృనాల్ పాండ్యా...

click me!