సీఈవో చెప్పిన వాళ్లనే ఆడించాలి, కష్టంగా ఉంటుంది... కేకేఆర్‌ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్..

Published : May 10, 2022, 03:57 PM ISTUpdated : May 10, 2022, 03:58 PM IST

యువకులతో నిండిన ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ని తొలిసారి ఫైనల్ చేర్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. కేకేఆర్‌లోకి భారీ అంచనాలతో వచ్చిన అయ్యర్, టీమ్‌ని ప్లేఆఫ్స్‌కి చేర్చడానికి నానా కష్టాలు పడుతున్నాడు. అయితే 2021 సీజన్‌లో డేవిడ్ వార్నర్ చేసిన తప్పే, 2022 సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ చేశాడని అంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...

PREV
19
సీఈవో చెప్పిన వాళ్లనే ఆడించాలి, కష్టంగా ఉంటుంది... కేకేఆర్‌ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్..

విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యరేనని ఫిక్స్ అయిపోయారంతా. అయితే గాయం అతని కెరీర్ గ్రాఫ్‌ని తలకిందులు చేసేసింది... ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్సీ కోల్పోయి, టీమిండియాలో చోటు కూడా కోల్పోవాల్సింది వచ్చింది...

29
Shreyas Iyer

ఎలాగోలా గాయం నుంచి కోలుకుని, టీమిండియాలోకి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్‌ని మెగా వేలంలో రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసి, కెప్టెన్‌గా నియమించింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

39

మొదటి నాలుగు మ్యాచుల తర్వాత వరుసగా ఐదు పరాజయాలు అందుకుని ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్... ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ని చిత్తు చేసింది...

49

అయితే ఈ మ్యాచ్‌కి ముందు ఏకంగా ఐదు మార్పులతో బరిలో దిగింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. సీనియర్ ప్లేయర్ అజింకా రహానేతో పాటు ప్యాట్ కమ్మిన్స్, వెంకటేశ్ అయ్యర్ లాంటి ప్లేయర్లు తిరిగి జట్టులో చోటు దక్కించుకోగలిగారు... 

59

ముంబైతో మ్యాచ్ అనంతరం టీమ్ సెలక్షన్ గురించి మాట్లాడుతూ... ‘ప్లేయర్లకు మీరు ఈ మ్యాచ్ ఆడడం లేదని చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. కోచ్‌తో పాటు కొన్ని సార్లు సీఈవో కూడా టీమ్ సెలక్షన్‌లో పాలుపంచుకుంటారు. ప్రతీ ప్లేయర్, టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని స్వీకరిస్తారు...

69

అవకాశం వచ్చినప్పుడు నూటికి నూరు శాతం పర్ఫామెన్స్ ఇవ్వడానికి కష్టపడతారు... ’ అంటూ శ్రేయాస్ అయ్యర్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. సీఈవో కూడా టీమ్ సెలక్షన్ విషయంలో చేయి పెడతాడని కామెంట్ చేయడం అయ్యర్‌ ఉద్దేశం ఏంటని నిలదీస్తున్నారు నెటిజన్లు...

79

గత సీజన్‌లో మనీశ్ పాండేని జట్టుకి ఎంపిక చేయకపోవడంపై మేనేజ్‌మెంట్‌‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు డేవిడ్ వార్నర్. ఈ కామెంట్ల కారణంగానే 2016 ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ అయినప్పటికీ వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తొలగించి, జట్టుకే దూరం చేశారు ఎస్‌ఆర్‌హెచ్ టీమ్ మేనేజ్‌మెంట్...

89

గత సీజన్‌లో కేకేఆర్‌ని ఫైనల్‌కి చేర్చినా ఇయాన్ మోర్గాన్‌ని తిరిగి కొనుగోలు చేయకపోవడానికి కూడా ఈ రకమైన వ్యాఖ్యలు కూడా ఓ కారణం. టీమ్ సెలక్షన్ విషయంలో స్వేచ్ఛ ఉండడం లేదని ఫస్టాఫ్ సమయంలో కామెంట్లు చేశాడు మోర్గాన్..
 

99

దీంతో ఈసారి కేకేఆర్‌ సీఈవోపై కామెంట్లు చేసిన శ్రేయాస్ అయ్యర్‌ని వచ్చే సీజన్‌లో మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ నుంచి తొలగించడం ఖాయమని అంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్... 

click me!

Recommended Stories