KL Rahul: రాహుల్ ఆశలపై నీళ్లు చల్లిన రబాడా.. పంజాబ్ పై పగ తీర్చుకోకుండానే పెవిలియన్ కు..

Published : Apr 29, 2022, 10:32 PM IST

TATA IPL 2022 PBKS vs LSG: నాలుగేండ్ల పాటు పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిథ్యం (రెండేండ్లు కెప్టెన్ గా) వహించిన ప్రస్తుత లక్నో సూపర్ జెయింట్స్ సారథి  కెఎల్ రాహుల్ తన మాజీ జట్టుపై రివేంజ్ తీర్చుకునే  అవకాశాలపై రబాడా నీళ్లు చల్లాడు. 

PREV
19
KL Rahul: రాహుల్ ఆశలపై నీళ్లు చల్లిన రబాడా.. పంజాబ్ పై పగ తీర్చుకోకుండానే పెవిలియన్ కు..

ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు మారినంత మంది సారథులు  మరే జట్టుకు మారలేదు. 15 సీజన్లలో ఆ జట్టుకు ఏకంగా 13 మంది నాయకులు పనిచేశారు. ఆ జాబితాలో 12వ నాయకుడు కెఎల్ రాహుల్.

29

2020 సీజన్ కు ముందు రాహుల్ కు పంజాబ్ కింగ్స్  కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది ఆ జట్టు యాజమాన్యం.  ఐపీఎల్ లో ఇంతవరకు  కప్ కొట్టని ఆ జట్టు.. రాహుల్ రాకతో అయినా ఆ ఆశ నెరవేర్చుకోవాలని చూసింది.  

39

అయితే  బ్యాటర్ గా సూపర్ సక్సెస్ అయిన  రాహుల్.. సారథి గా మాత్రం అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. ఐపీఎల్ 2020 సీజన్ లో 14 మ్యాచులాడిన (పంజాబ్ తరఫున) అతడు 670 పరుగులు చేయగా, తర్వాతి సీజన్ లో కూడా 626 రన్స్ చేశాడు.  అంతకుముందు 2018లో 659, 2019లో 593 రన్స్ సాధించాడు. 

49

పంజాబ్ లో ఉన్నన్ని (2018 నుంచి 2021 దాకా) రోజులు బ్యాటర్ గా పరుగుల వరద పారించిన రాహుల్.. గత సీజన్ తర్వాత యాజయాన్యంతో విభేదాలతో ఆ జట్టు నుంచి దూరం జరిగాడు.  ఐపీఎల్ రిటెన్షన్-2022 కు ముందే పంజాబ్ ను వీడాడు. ఐపీఎల్ లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తో చర్చలు జరిపి వారితో చేరాడు.

59

రిటెన్షన్ సందర్బంగా పంజాబ్ జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే కూడా.. జట్టును వీడొద్దని రాహుల్ కు తాము చెప్పి చూశామని అయితే అతడు మాత్రం అందుకు ఆమోదం తెలపలేదని, దాంతో తాము కూడా రాహుల్ ను వదులుకున్నామని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.  

69

రాహుల్ ప్రదర్శన పై సంతృప్తిగానే ఉన్నా అతడి  కెప్టెన్సీ స్కిల్స్ మీద పంజాబ్ యాజమాన్యం తీవ్ర నిరాశలో ఉందని, అందుకే రాహుల్ తో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైందని కూడా గతంలో వార్తలొచ్చాయి. 

79

ఈ వార్తల నేపథ్యంలో ఐపీఎల్-2022 లో తన మాజీ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాలని  చూశాడు. ఈ మ్యాచ్ కు ముందు రాహుల్.. 8 మ్యాచుల్లో 368 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు (ముంబైపై) కూడా ఉన్నాయి.   లక్నో ఆడిన గత మ్యాచ్ లో కూడా రాహుల్ సెంచరీ చేశాడు

89

ఇక ఇదే ఫామ్ ను రాహుల్ తన మాజీ  జట్టుపై చూపిస్తాడని, పంజాబ్ పై ప్రతీకారం ఖాయమనుకున్నారంతా. అయితే టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన రాహుల్.. 11 బంతులాడి 6 పరుగులే చేశాడు.  ఇక మూడో ఓవర్లో  బౌలింగ్ కు వచ్చిన రబాడా.. అతడిని  ఔట్ చేశాడు.  దీంతో రాహుల్ ఆశలపై  రబాడా నీళ్లు చల్లినట్టు అయింది. 
 

99

ఈ మ్యాచ్ లో రబాడా.. రాహుల్ నే కాదు, మరో 3 వికెట్లు కూడా తీసి  లక్నోను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. కృనాల్ పాండ్యా, అయుష్ బదోని తో పాటు చమీర ను కూడా రబాడానే పెవిలియన్ కు పంపాడు. ఫలితంగా లక్నో.. 20 ఓవర్లలో 153 పరుగులే  చేయగలిగింది. 

click me!

Recommended Stories