అందులో జడేజా తప్పేం లేదు, ఒడ్డున పడ్డ చేపలా గిలగిలలాడిపోయాడు... - భారత మాజీ కోచ్ రవిశాస్త్రి

First Published May 10, 2022, 10:13 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎన్నో ఆశలతో కెప్టెన్‌గా కెరీర్ మొదలెట్టి, అంతలోనే ఆ పొజిషన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. 14 సీజన్ల తర్వాత కెప్టెన్‌గా కెరీర్ మొదలెట్టిన పట్టుమని 10 మ్యాచులు కూడా ఆ భారాన్ని మోయలేకపోయాడు...

రవీంద్ర జడేజా కెప్టెన్సీలో వరుసగా మొదటి నాలుగు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, ఆ తర్వాత తొలి విజయాన్ని అందుకున్నా... ప్లేయర్‌గా మాత్రం జడ్డూ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...

Ravindra Jadeja

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా 10 మ్యాచులు ఆడిన రవీంద్ర జడేజా, 116 పరుగులు మాత్రమే చేయగలిగాడు. స్ట్రైయిక్ రేటు 118.3 మాత్రమే.. అత్యధిక స్కోరు 26 పరుగులు నాటౌట్..

Latest Videos


బౌలర్‌గానూ పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన రవీంద్ర జడేజా, 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇందులో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో తీసిన 3 వికెట్లు తీస్తే... మిగిలిన మ్యాచుల్లో తీసింది 2 వికెట్లే...

బౌండరీ లైన్ దగ్గర గాల్లోకి ఎగురుతూ కళ్లు చెదిరే క్యాచులు అందుకోవడంలో స్పెషలిస్ట్ అయిన రవీంద్ర జడేజా... కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత చేతుల్లోకి వచ్చిన ఈజీ క్యాచులను కూడా జారవిడిచాడు...

ప్లేయర్‌గా, కెప్టెన్‌గా అట్టర్ ఫ్లాప్ అవుతుండడంతో 8 మ్యాచులు ముగిసిన తర్వాత సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు రవీంద్ర జడేజా. దీంతో తిరిగి సీఎస్‌కే సారథిగా ధోనీ బాధ్యతలు తీసుకున్నాడు..

‘జరిగిన దాంట్లో జడేజా తప్పేం లేదు. ఎందుకంటే అతను నాచురల్ కెప్టెన్ కాదు. తన కెరీర్‌లో ఏ దశలోనూ జడేజా కెప్టెన్సీ చేసింది లేదు. అందుకే జడేజా, ఈ వయసులో కెప్టెన్సీ వచ్చేసరికి కాస్త ప్రెషర్ ఫీల్ అయ్యాడు...

చాలామంది జడేజా కెప్టెన్సీని తప్పుబడుతున్నారు. అయితే ఏ మాత్రం కెప్టెన్సీ అనుభవం లేని జడేజాని కెప్టెన్‌గా ఎంచుకోవడమే సీఎస్‌కే చేసిన తప్పు. చెన్నై సూపర్ కింగ్స్ లాంటి సక్సెస్‌ఫుల్ టీమ్‌ని నడిపించాలంటే చాలా అనుభవం ఉండాలి...

అయితే ప్లేయర్‌గా అనుభవం ఉన్నా, కెప్టెన్‌గా జడేజా అనుభవం సున్నా. అందులో ఒడ్డున పడ్డ చేప పిల్లలా, కెప్టెన్ ప్రెషర్‌ని తట్టుకోలేక గిల గిలా కొట్టుకున్నాడు.. అది అతని స్థానం కాదు...
 

జడేజా లాంటి క్రికెటర్లు, ప్లేయర్లుగానే అద్భుతంగా రాణిస్తారు. వారిని కెప్టెన్సీకి దూరంగా పెట్టడం వారికి, జట్టుకీ చాలా మంచిది. అందుకే అతన్ని క్రికెట్‌పై ఫోకస్ పెట్టనివ్వండి...

Jadeja-Dhoni

రవీంద్ర జడేజా ప్రపంచంలోనే బెస్ట్ ఆల్‌రౌండర్లలో ఒకడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే కెప్టెన్సీ అతనికి చేతకాని పని. ఆ విషయాన్ని జడేజా కూడా తెలుసుకుని ఉంటాడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి..

click me!