ఐపీఎల్ వల్లే మా ఫ్రెండ్‌షిప్ నాశనమైంది, నాకు అంత ధర పలకడం చూసి... ఆండ్రూ సైమండ్స్ సంచలన వ్యాఖ్యలు...

Published : Apr 24, 2022, 08:48 PM ISTUpdated : Apr 24, 2022, 08:51 PM IST

ఐపీఎల్... ప్రపంచవ్యాప్తంగా ఎందరో క్రికెటర్లను వెలుగులోకి తెచ్చి, ఓవర్‌నైట్ స్టార్లుగా మలిచిన వేదిక. ఏబీ డివిల్లియర్స్- విరాట్ కోహ్లీల్లా చాలామంది స్నేహితులు కూడా ఇదే స్టేజీపై దగ్గరయ్యారు. అయితే ఐపీఎల్ వల్లే తన స్నేహితుడు, తనకి దూరమయ్యాడని అంటున్నాడు ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్...  

PREV
18
ఐపీఎల్ వల్లే మా ఫ్రెండ్‌షిప్ నాశనమైంది, నాకు అంత ధర పలకడం చూసి... ఆండ్రూ సైమండ్స్ సంచలన వ్యాఖ్యలు...

ఆస్ట్రేలియా తరుపున 26 టెస్టులు, 198 వన్డేలు ఆడిన ఆండ్రూ సైమండ్స్... ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జెర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల తరుపున ఆడాడు...

28

2007 వన్డే వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆండ్రూ సైమండ్స్, ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్... మంచి స్నేహితులుగా ఉండేవాళ్లు. అయితే స్టార్ ప్లేయర్‌గా ఎదుగుతున్న సమయంలోనే సైమండ్స్ కెరీర్‌కి అర్ధాంతరంగా ముగింపు కార్డు పడింది..
 

38

2008లో ఓ వన్డే మ్యాచ్‌కి ఆండ్రూ సైమండ్స్ తాగేసి మత్తులో వచ్చాడని మైకేల్ క్లార్క్ వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. క్లార్క్ కెప్టెన్సీని తీవ్రంగా విమర్శించిన ఆండ్రూ సైమండ్స్... తాజాగా తమ మధ్య ఉన్న విబేధాలను బయటపెట్టాడు...

48

‘నా కెప్టెన్సీని విమర్శిస్తూ ఆండ్రూ సైమండ్స్ మీడియాని ఆశ్రయించాడు. ఐ యామ్ సారీ, అయితే అతను నా కెప్టెన్సీని జడ్జ్ చేసే వ్యక్తి కాదు. దేశానికి మ్యాచ్ ఆడేటప్పుడు తాగి వచ్చే వచ్చి, నన్ను విమర్శిస్తాడా? ఇతరులను విమర్శించే అర్హత అతనికి లేదు...’ అంటూ తన యాషెస్ డైరీలో సైమండ్స్ గురించి రాసుకొచ్చాడు మైకేల్ క్లార్క్...

58

అయితే మైకేల్ క్లార్క్‌తో తన స్నేహం, శత్రుత్వంగా మారడానికి ఐపీఎల్ కారణమంటున్నాడు ఆండ్రూ సైమండ్స్. ఐపీఎల్ 2008 సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్, రూ.5.4 కోట్లు పెట్టి ఆండ్రై సైమండ్స్‌ని కొనుగోలు చేసింది...

68

ఆరంగ్రేటం సీజన్‌లో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు ఆండ్రూ సైమండ్స్.. ‘మేం చాలా మంచి స్నేహితులం. మేం చాలా మ్యాచుల్లో కలిసి బ్యాటింగ్ చేసి, జట్టును గెలిపించాం కూడా...

78

మా మధ్య మంచి బంధం ఏర్పడింది. అయితే ఐపీఎల్ మొదలైన తర్వాత నాకు భారీ ధర పలకడం చూసి మైకేల్ క్లార్క్ బాగా జెలసీ ఫీల్ అయ్యాడట. అందుకే నేనంటే అతనికి నచ్చేది కాదని మాథ్యూ హేడెన్ చెప్పాడు..

88

డబ్బు చాలా ఫన్నీ విషయాలు చేస్తుంది. డబ్బు మంచిదే కానీ దాని వల్ల లోపలున్న విషం బయటపడుతుంది. దాని వల్లే మా బంధం చెడిపోయింది. అతనంటే నాకు గౌరవం ఉంది. అందుకే అన్ని విషయాలు బయటపెట్టలేకపోతున్నా...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆండ్రూ సైమండ్స్...

click me!

Recommended Stories