పడి లేచిన కెరటం దినేష్ కార్తీక్... మొదటి భార్య మోసం, ప్రాణస్నేహితుడి ద్రోహం నుంచి...

Published : May 16, 2022, 04:21 PM IST

దినేశ్ కార్తీక్... ఐపీఎల్ 2022 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్న సీనియర్ వికెట్ కీపర్. ఆర్‌సీబీకి మ్యాచ్ ఫినిషర్‌గా మారిన దినేశ్ కార్తీక్, 13 మ్యాచుల్లో 285 పరుగులు చేశాడు...

PREV
118
పడి లేచిన కెరటం దినేష్ కార్తీక్... మొదటి భార్య మోసం,  ప్రాణస్నేహితుడి ద్రోహం నుంచి...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఎంపిక చేసిన భారత జట్టులో దినేశ్ కార్తీక్‌కి చోటు ఉండాల్సిదేనని ఇప్పటికే సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు కామెంట్లు కూడా చేశారు...

218

నిలకడైన ప్రదర్శన ఇవ్వలేక, టీ20ల్లో మ్యాచ్ ఫినిష్ చేయలేకపోతున్న రిషబ్ పంత్ కంటే సుదీర్ఘ అనుభవం ఉన్న దినేశ్ కార్తీక్ అవసరం టీమిండియాకి ఉందని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు...

318

అయితే దినేశ్ కార్తీక్ కెరీర్ గ్రాఫ్ అంత సజావుగా ఏమీ సాగలేదు. ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు తమిళనాడుకి చెందిన దినేశ్ కార్తీక్...

418

ఎప్పుడూ నవ్వుతూ కనిపించే భారత క్రికెటర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చిరునవ్వు వెనకాల చాలా పెద్ద అగాథమే దాగి ఉంది. కార్తీక్ జీవితంలో కూడా ఓ స్నేహితుడి మోసం వల్ల కలిగిన గాయం ఉంది. దినేశ్ కార్తీక్ మొదటి భార్య నికితా వంజర, అతన్ని మోసం చేసి క్రికెటర్ మురళీ విజయ్‌తో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకుంది.

518

తమిళనాడు జట్టుకు ఆడే మురళీ విజయ్, దినేశ్ కార్తీక్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. దేశవాళీ టోర్నీల్లో తమిళనాడు టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహారించే దినేశ్ కార్తీక్, 21 ఏళ్ల వయసులో 2007లో చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజరను పెళ్లి చేసుకున్నాడు. 

618

నికితా తండ్రి, దినేశ్ కార్తీక్ వాళ్ల తండ్రి ఇద్దరూ స్నేహితులు కావడంతో ఈ ఇద్దరూ కలిసి పెరిగారు. వీరి పెళ్లి ముంబైలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి తమిళనాడు క్రికెటర్‌గా ఉన్న మురళీ విజయ్ కూడా హాజరయ్యాడు.

718

స్నేహితుడైన దినేశ్ కార్తీక్ ఇంటికి తరుచుగా వెళ్లి వస్తుండేవాడు మురళీ విజయ్. అలా నికితాకి దగ్గరైన మురళీ విజయ్, స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కార్తీక్ ఇంట్లో లేని సమయంలోనూ మురళీ విజయ్ అతని ఇంట్లోనే ఉండేవాడు. ఈ విషయం దినేశ్ కార్తీక్‌కి తప్ప తమిళనాడు జట్టు ప్లేయర్లందరికీ తెలుసు...

818

2012లో తమిళనాడు విజయ్ హాజారే ట్రోఫీలో కర్ణాటకతో మ్యాచ్ ఆడుతున్న సమయంలో దినేశ్ కార్తీక్‌కి, మురళీ విజయ్‌కి తన భార్యకి ఉన్న వివాహేతర సంబంధం గురించి తెలిసింది... 

918

భార్య తనను మోసం చేసిందన్న బాధకంటే, తన స్నేహితుడు చేసిన మోసాన్ని దినేశ్ కార్తీక్ తట్టుకోలేకపోయాడు. విషయం తెలిసిన తర్వాత నికితాకి విడాకులు ఇచ్చేశాడు.  దినేశ్ కార్తీక్‌కి విడాకులు ఇచ్చిన తర్వాత నెల తర్వాత ఆమె గర్భవతి అనే విషయం తెలిసింది. దీంతో ఆ బిడ్డకు తానే తండ్రినని తెలుసుకున్న మురళీ విజయ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

1018

ఇప్పుడు నికితా, మురళీ విజయ్‌లకు ముగ్గురు పిల్లలు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న మురళీ విజయ్, దినేశ్ కార్తీక్... ఈ సంఘటన తర్వాత బద్ధ శత్రువులుగా మారిపోయారు. 

1118

దినేశ్ కార్తీక్‌తో మాట్లాడడానికి కానీ ముఖం చూపించడానికి కానీ మురళీ విజయ్ సాహసించడు. అయితే 2018లో ఈ ఇద్దరూ కలిసి టీమిండియాకి ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ సిరీస్ నడుస్తున్నంతసేపు ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగానే గడిపారు.

1218

ఒకేసారి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా దినేశ్ కార్తీక్‌తో మురళీ విజయ్, తన మాజీ భార్య భర్తతో డీకే మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత ఈ ఇద్దరూ భారత జట్టుకి ఎంపిక కాకపోవడానికి కూడా ఇదే కారణం.

1318

నికితా, మురళీ విజయ్ ఇచ్చిన షాక్ నుంచి తేలుకోవడానికి మూడేళ్ల సమయం తీసుకున్నాడే దినేశ్ కార్తీక్. తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి, బయటికి వెళ్లడానికి కూడా ఇష్టపడేవాడు కాదు...

1418

ఫిట్‌నెస్ కోల్పోయి, క్రికెట్‌లో కూడా ఫెయిల్ అవ్వడం మొదలెట్టాడు. తాను, తన ఆట పడిపోతున్న విషయాన్ని గమనించిన దినేశ్ కార్తీక్, తాను చేయని తప్పుకి ఇలా కృంగిపోకూడదని నిర్ణయం తీసుకున్నాడు...

1518

డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. అలా జిమ్‌లో చేరిన దినేశ్ కార్తీక్‌కి, భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌తో పరిచయం ఏర్పరింది...

1618

భారత క్రికెటర్ అయినా ఎంతో వినయంగా, సింపుల్‌గా ఉండే దినేశ్ కార్తీక్ వ్యక్తిత్వం, దీపికాకి బాగా నచ్చింది. ఒకే కోచ్‌ దగ్గర ఫిట్‌నెస్ పాఠాలు నేర్చుకున్న ఈ ఇద్దరూ... ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు.

1718

వాస్తవానికి దినేశ్ కార్తీక్‌తో పరిచయం కలగడానికి ముందు దీపికాకి క్రికెటర్లు అంటే అసహ్యం ఉండేది. క్రికెటర్ల కొట్టే ఫోజులు, క్రికెట్ వల్ల మిగిలిన ఆటలకు గుర్తింపు దక్కడం లేదని దీపికా ఫీల్ అయ్యేది. అయితే దినేశ్ కార్తీక్ వ్యక్తిత్వాన్ని చూసిన తర్వాత ఆమె క్రికెట్‌ని కూడా ఇష్టపడడం మొదలెట్టింది...

1818

అలా భారత క్రికెట్‌లో సూపర్ స్టార్‌లా ఎదుగుతాడని భావించిన దినేశ్ కార్తీక్, వ్యక్తిగత జీవితంలో కలిగిన అలజడుల కారణంగా జట్టుకి దూరమై... పడిలేచిన కెరటంలా మళ్లీ 37 ఏళ్ల వయసులో,యువ క్రికెటర్లకు పోటీ ఇస్తున్నాడు. మరోవైపు స్నేహితుడిని మోసం చేసి, అతని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మురళీవిజయ్, భారత జట్టులోనూ, ఐపీఎల్‌లోనూ చోటు కోల్పోవడం కొసమెరుపు.. 

click me!

Recommended Stories