కెప్టెన్‌ని కాకా పడుతున్న అంబటి రాయుడు... త్వరలోనే టీమిండియా కెప్టెన్ అవుతాడంటూ...

First Published Apr 25, 2022, 6:18 PM IST

ఐపీఎల్ చరిత్రలో 14 సీజన్లు ఆడిన తర్వాత కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న అరుదైన ప్లేయర్ రవీంద్ర జడేజా. గత సీజన్‌లో ఆల్‌రౌండ్ షోతో సీఎస్‌కే టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించిన జడ్డూ... ఈ సారి కెప్టెన్‌గా మాత్రం తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు...

రవీంద్ర జడేజా కెప్టెన్సీలో ఐపీఎల్ 2022 సీజన్‌లో మొదటి 7 మ్యాచుల్లో రెండే రెండు విజయాలు అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఆఖరి బంతికి మాహీ ఫోర్ బాదడంతో గెలిచి ఊపిరి పీల్చుకుంది...

గత సీజన్‌లో అటు బ్యాటుతో మెరుపులు మెరిపించి, బంతితో రాణించి, ఫీల్డింగ్‌లో విన్యాసాలు చేసిన రవీంద్ర జడేజా... ఈ సారి ప్లేయర్‌గా సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు...

Latest Videos


అయితే సీఎస్‌కే ప్లేయర్ అంబటి రాయుడు మాత్రం రవీంద్ర జడేజా కెప్టెన్సీని మెచ్చుకుంటున్నాడు. ఫ్యూచర్‌లో జడ్డూ టీమిండియా కెప్టెన్ అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నాడు...

‘ప్రతీ ఒక్కదానికి సమయం రావాలి. సీఎస్‌కేలో యేటికేటికీ కొత్త కుర్రాళ్ల రాక పెరుగుతోంది. జడేజా లాంటి యంగ్ కెప్టెన్ ఉండడం వల్ల, కుర్రాళ్లు కాన్ఫిడెంట్‌గా ఆడుతూ రాణించగలుగుతున్నారు...

సీఎస్‌కేలోని ముకేశ్ చౌదరి వంటి కుర్రాళ్లకు కెప్టెన్ జడేజా సపోర్ట్ చాలా ఉంది. ఆరంభంలో ఫెయిల్ అయినా అతనికి వరుసగా అవకాశాలిచ్చి ప్రోత్సహించాడు జడేజా... అదే గొప్ప కెప్టెన్‌కి ఉండాల్సిన లక్షణం...

సీఎస్‌కే, జడేజా కెప్టెన్సీలో చాలా సక్సెస్‌ఫుల్ టీమ్‌గా మారుతుంది. అందులో నాకు ఎలాంటి సందేహాలు లేవు. మాహీ స్థానాన్ని భర్తీ చేయడం ఎవ్వరి తరం కాదు. అయితే మాహీ గైడెన్స్‌లో జడ్డూ రోజురోజుకీ మెరగవుతున్నాడు...

జడేజా కెప్టెన్సీలో వస్తున్న పరిణితి చూస్తుంటే అది చెన్నై సూపర్ కింగ్స్‌నే కాదు, త్వరలోనే టీమిండియాని కూడా నడిపిస్తాడని అనిపిస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు అంబటి రాయుడు...
 

Ravindra Jadeja

ప్రస్తుతం రవీంద్ర జడేజా వయసు 33 ఏళ్లు. 34 ఏళ్ల రోహిత్ శర్మకు టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడంపైనే తీవ్రమైన విమర్శలు వచ్చాయి. రోహిత్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ లాంటి యువ ప్లేయర్‌కి కెప్టెన్సీ ఇవ్వాల్సిందని ట్రోల్స్ వినిపించాయి..

ఏదో తన కెప్టెన్‌ని పొడిగితే, టీమ్‌లో ప్లేస్ ఎక్కడికీ పోదని అంబటి రాయుడు... అలా రవీంద్ర జడేజాని పొడిగి ఉంటాడని... జడ్డూకి టీమిండియా కెప్టెన్ అయ్యే అవకాశాలు లేవంటున్నారు భారత జట్టు ఫ్యాన్స్.

ఇప్పటికే ఐపీఎల్‌ ఫస్టాఫ్‌లో ఘోరంగా విఫలమైన రవీంద్ర జడేజాకి టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చే ఆలోచన, సాహసం బీసీసీఐ పెద్దలు చేయకపోవచ్చని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్..

click me!