TATA IPL 2022 - PBKS vs SRH: ఆరెంజ్ ఆర్మీ ఎంతో ఇష్టంగా కేన్ మామ అని పిలుచుకునే సన్ రైజర్స్ సారథి కేన్ విలియమ్సన్ ఈ సీజన్ లో టాస్ కా బాస్ అయ్యాడు. టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే అనే ట్రెండ్ నడుస్తున్న ఈ సీజన్ లో విలియమ్సన్ ఏకంగా...
సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి కేన్ విలియమ్సన్ ఈ సీజన్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్-2022 లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కూడా కేన్ మామ టాస్ గెలిచాడు.
27
ఈ సీజన్ లో కేన్ మామ టాస్ గెలవడం ఇది ఆరోసారి. అంటే ఇప్పటివరకు సన్ రైజర్స్ ఆడిన ప్రతి మ్యాచులోనూ టాస్ మనదే. తాజాగా వాంఖెడే లో పంజాబ్ తో మ్యాచ్ లో కూడా టాస్ విలియమ్సన్ నే వరించింది.
37
టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే అనే ట్రెండ్ నడుస్తున్న తరుణంలో విలియమ్సన్ ఏకంగా ఆరుసార్లు టాస్ గెలవడం విశేషం. ఈ సీజన్ లో వరుసగా ఆరు టాస్ లు గెలిచిన సారథి మరొకరు లేరు.
47
అయితే తొలి రెండు మ్యాచులలో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ లు నెగ్గినా మ్యాచులు మాత్రం కోల్పోయింది. రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మీద దారుణ పరాజయాలు ఎదురయ్యాయి.
57
కానీ తర్వాత హైదరాబాద్ పుంజుకుంది. చెన్నైని ఓడించి విజయాల బాట పట్టిన సన్ రైజర్స్.. ఆ తర్వాత వరుసగా గుజరాత్ టైటాన్స్ (హ్యాట్రిక్ విజయాల తర్వాత ఆ జట్టుకు తొలి పరాజయం)ను ఓడించింది. ఆ తదుపరి మ్యాచులోనే కేకేఆర్ కు కూడా ఓటమి రుచి చూపించింది.
67
వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ కొట్టిన సన్ రైజర్స్.. డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నది. పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో గెలిచి అందుకు బాటలు వేసుకోవాలని ఆరాటపడుతున్నది.
77
కాగా 2016 లో ట్రోఫీ గెలిచిన ఆరెంజ్ ఆర్మీ.. తర్వాత వరుసగా నాలుగు సార్లు ప్లే ఆఫ్స్ కు చేరింది. అయితే గతేడాది మాత్రం పలు కారణాలతో లీగ్ లో అట్టడుగు స్థాయిలో నిలిచింది.