ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, మొట్టమొదటి సీజన్‌లోనే ఊహించని ఆటతీరుతో టైటిల్ విజేతగా నిలిచింది. టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్, క్వాలిఫైయర్ 1, ఫైనల్ మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్‌ని చిత్తు చేసి... ఛాంపియన్‌గా నిలిచింది...
క్వాలిఫైయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌కి మంచి పోటీ ఇస్తూ 190 పరుగుల స్కోరు చేసిన రాజస్థాన్ రాయల్స్, ఫైనల్ మ్యాచ్‌లో 130 పరుగులకే పరిమితమై, 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది...
29
14 సీజన్ల తర్వాత ఫైనల్‌కి వచ్చిన రాజస్థాన్ రాయల్స్, క్వాలిఫైయర్ 1తో పాటు రెండో క్వాలిఫైయర్‌లోనూ ఛాంపియన్ పర్ఫామెన్స్ చూపించింది. ఆర్‌సీబీతో జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో పూర్తిగా రాయల్స్ డామినేషన్ కనిపించింది...
39
ఐపీఎల్ 2022 సీజన్‌లో 16 మ్యాచుల్లో 13 సార్లు టాస్ ఓడిపోయిన సంజూ శాంసన్, ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి మరీ బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం.. రాజస్థాన్ రాయల్స్ విజయంపై తీవ్రంగా ప్రభావం చూపింది..
49
యశస్వి జైస్వాల్ అవుటైన తర్వాత సంజూ శాంసన్, జోస్ బట్లర్, సిమ్రాన్ హెట్మయర్, దేవ్‌దత్ పడిక్కల్ పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడి, వెంటవెంటనే వికెట్లు పారేసుకున్నారు...
59
సీజన్ మొత్తంలో రాజస్థాన్ రాయల్స్ చూపించిన ఓ రకంగా ఉంటే, ఫైనల్‌లో వాళ్ల ఆటతీరు మరోలా ఉండింది. ఆర్‌సీబీతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 144 పరుగుల స్వల్ప స్కోరు చేసినా దాన్ని కాపాడుకుంటూ ప్రత్యర్థిని 115 పరుగులకి ఆలౌట్ చేసిన ఆర్ఆర్... ఫైనల్‌లో వికెట్లు తీయడానికి తెగ కష్టపడింది...
69
దీంతో ఫైనల్ మ్యాచ్ సాగుతున్నంత సేపు ‘ఫిక్సింగ్’ హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు సోషల్ మీడియా జనాలు... అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన కుమారుడు జై షా, బీసీసీఐ సెక్రటరీ హోదాలో కొనసాగుతున్నారు...
79
గుజరాత్ టైటాన్స్‌ని అదీ గుజరాత్‌లోని సొంత మైదానంలో బీజేపీ పెద్దలు హాజరైనప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఓడిస్తే.. అది కేంద్రానికి పెద్ద అవమానమే. అందుకే గుజరాత్ టైటాన్స్ గెలిచేలా చేశారని ఆరోపణలు చేస్తూ ‘ఫిక్సింగ్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు కొందరు...
89
గుజరాత్‌లో కొన్నేళ్లుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అలాగే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడే... నరేంద్ర మోదీ రాష్ట్రానికి చెందిన ఫ్రాంఛైజీ ఫైనల్ చేరడంతో భారత జనతా పార్టీ మద్ధతుదారులతో పాటు మోదీ ఫ్యాన్స్, గుజరాత్ టైటాన్స్‌కి భారీగా సపోర్ట్ చేశారు... ఇది ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ని తీవ్రమైన ఒత్తిడిలోకి పడేసింది...
99
Image credit: PTI
రాజస్థాన్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్‌ని కాస్తా గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్‌గా కాకుండా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మ్యాచ్‌గా అభివర్ణిస్తూ... మరోసారి మోదీ పార్టీ ఐపీఎల్ గ్రౌండ్‌లో విజయం సాధించిందని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు..