ఇప్పటికైనా గుర్తించారు.. ధన్యవాదాలు.. టీమిండియాలోకి తిరిగి రావడంపై నయా వాల్ కామెంట్స్

Published : May 23, 2022, 02:35 PM IST

Cheteshwar Pujara: వరుస సిరీస్ లలో వైఫల్యాలతో జట్టులో స్థానం కోల్పోయిన టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారా.. తిరిగి జట్టుతో చేరాడు. కౌంటీలలో అదరగొడుతున్న పుజారా.. ఇంగ్లాండ్ తో ఐదో టెస్టు ఆడనున్నాడు. 

PREV
19
ఇప్పటికైనా గుర్తించారు.. ధన్యవాదాలు.. టీమిండియాలోకి తిరిగి రావడంపై నయా వాల్ కామెంట్స్

టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారా కౌంటీలలో అదిరిపోయే ప్రదర్శనలతో తిరిగి జట్టులోకి  వచ్చాడు. ఇంగ్లాండ్ తో అర్థాంతరంగా ఆగిపోయిన ఐదో టెస్టు కోసం ఆదివారం సెలెక్టర్లు ప్రకటించిన 17 మంది  సభ్యులలో పుజారా కూడా ఉన్నాడు. 
 

29

స్వదేశంలో శ్రీలంకతో జరిగిన సిరీస్ కు ముందు వరుస వైఫల్యాలతో జట్టులో స్థానం కోల్పోయి.. దాదాపు  ఇక శాశ్వత ఉధ్వాసనే అన్న స్థాయికి వెళ్లిన పుజారా..  కౌంటీలలో మాత్రం అదరగొడుతున్నాడు. 

39

తిరిగి భారత జట్టులోకి రావడానికి కౌంటీలు ఆడుతున్న పుజారా.. ససెక్స్ తరఫున ఆడుతూ ఐదు మ్యాచుల్లోనే ఏకంగా 720 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా ఐదు సెంచరీలు ఉన్నాయి. ఆ ఐదింటిలో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉండటం విశేషం. 

49

తన పునరాగమనాన్ని ఘనంగా చాటిన పుజారా.. తనను గుర్తించి తిరిగి జట్టులోకి స్థానం కల్పించినందుకు సెలెక్టర్లకు టీమ్ మేనేజ్మెంట్ కు  కృతజ్ఞతలు తెలిపాడు. 

59

ఇదే విషయమై పుజారా మాట్లాడుతూ.. ‘ఇంగ్లాండ్ తో టెస్టుకు గాను నన్ను ఎంపికచేయడం సంతోషంగా ఉంది.  ఇటీవలి నా కౌంటీ ప్రదర్శనలను గుర్తించినందుకు ధన్యవాదాలు. తిరిగి ఫామ్ ను పొంది జాతీయ జట్టులోకి రావడం మాటలలో చెప్పలేని అనుభూతి.  

69

కౌంటీల కారణంగా నా ఆట మెరుగుపడింది. ఇదే ఆటను ఇంగ్లాండ్ తో టెస్టులలో కూడా చూపిస్తా.. ఇంగ్లాండ్ సిరీస్ కోసం నేను బాగా ప్రిపేర్ అవుతున్నాను. భారత జట్టు కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తా..’ అని పుజారా తెలిపాడు. 

79

కాగా గతేడాది ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన భారత జట్టు నాలుగు టెస్టులు ఆడి అందులో రెండింటిలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఒక టెస్టులో ఇంగ్లాండ్ గెలవగా మరో మ్యాచ్  డ్రా అయింది.అయితే కరోనా కారణంగా ఈ సిరీస్ ను అర్థాంతరంగా వాయిదావేశారు. ఆ వాయిదా వేసిన టెస్టునే ఇప్పుడు ఆడబోతున్నారు. 

89

జులై 1 నుంచి 5 వరకు ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ కోసం భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. 17 మందితో కూడిన ఈ జట్టు లో  పుజారాతో పాటు హనుమా విహారికి కూడా అవకాశం దక్కింది. 

99

ఇంగ్లాండ్ తో ఏకైక టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, ఛతేశ్వర్ పూజారా, రిషబ్ పంత్, కెఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ

click me!

Recommended Stories